CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఫిబ్రవరిలో జరిగే మినీ మేడారం జాతర విజయవంతం చేయాలి :జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

Share it:


మన్యం న్యూస్, ములుగు:


ఫిబ్రవరి మాసంలో జరిగే మినీ మేడారం జాతర విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఐటీడీఏ పిఓ అంకిత్ తో కలసి  మేడారం పూజారులు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలో  మేడారం అంటేనే ప్రత్యేక గుర్తింపుని అన్నారు. 

జిల్లాలో మినీ జాతర నిర్వహించే గిరిజనుల ఆరాధ్య దైవమైన సమ్మక్క,సారలమ్మ దేవాలయ పరిసర గ్రామాలలో జరిగే జాతర దేవాలయాల పునర్నిర్మాణం అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామని కలెక్టర్ అన్నారు.మినీ జాతరలో భక్తులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు,టాయిలెట్స్,షెడ్స్ అన్ని విధాల ఏర్పాట్లు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.

అక్రమ గుడుంబా నియంత్రించాలని గుడుంబా తయారీ కోసం అమ్మవారి వద్ద ఉన్న బెల్లన్ని ఉపయోగిం చరాదని అందుకు కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆదేశించారు.ఈ సందర్భంగా మేడారం ప్రధాన పూజారి సిద్ధమైన జగ్గారావు మేడారం జాతరలో బెల్లం కొబ్బరికాయల దుకాణాలు పూజారులకు కేటాయించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

మేడారంలో ఇప్పటికే   భక్తుల నివాసార్థం షెడ్లు ఏర్పాటు చేశామని,27 షెట్లర్ లను   పూజారులకు  షాపుల కోసం నిర్మించినామని కలెక్టర్ తెలిపారు.గిరిజనుల సంస్కృతి ఆచారం సమ్మక్క సారలమ్మ జాతర అని వారి ఆచారాలను గౌరవిస్తామని అన్నారు.

కొబ్బరికాయలు బెల్లం పూజారులు అమ్ముకునే విధంగా ప్రత్యేక చొరవ చూపాలని దేవాదాయ శాఖ ఈవో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.దేవాలయం చుట్టూ ప్రధాన గేటు దగ్గర లో ఉన్న షాపులను తొలగిం చేందుకు  చర్యలు చేపట్టాలని ఆదేశించారు.అమ్మవారి గద్దెల వద్ద బెల్లం స్టోరీ చేసి ప్రత్యేక షెడ్డును ఏర్పాటు చేసు కోవాలని ఆదేశించారు.

మేడారంలో భక్తుల సౌకర్యం ఇంకా కొత్త షెడ్లు నిర్మిస్తామని ప్రతిపాదనలు పంపాలని కోరారు.2024 లో జరిగే మహా జాతరకు 8 నెలల ముందు అభివృద్ధి పనులు చేపడ తామని అవసరమైన వాటిని ప్రతిపాదనలు పంపాలని సంబంధిత శాఖ అధికారులను కోరారు.ఎక్సైజ్ శాఖ కంట్రోల్ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కొండాయి లో జరిగే గోవిందరాజుల దేవాలయానికి ఫెన్సింగ్ వేయిస్తామన్నారు.

గిరిజనుల ఆరోగ్యదేవన సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతం చేసి గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ వారికి ఆదాయం సమకూరేల కృషి చేస్తామని అన్నారు.ఐ టి డి ఏ ఏటూరు నాగారం ఆధ్వర్యంలో నిధులు మంజూరు చేసి జాతర నిర్వహణకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా కలెక్టర్ 

స్పష్టం చేశారు.ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ఓ కే రమాదేవి,ఎక్సైజ్  శాఖ ఏసి ఆర్ నగేందర్ రావు,సూపర్డెంట్ వి శ్రీనివాస్, డి ఎం ఎం హెచ్ అప్పయ్య, డిపిఓ వెంకయ్య, తాడువాయి తహసిల్దార్ ఎం శ్రీనివాస్, మేడారం ఈవో రాజేంద్రన్, మేడారం ప్రధాన పూజారి సిద్దబోయిన జగ్గారావు,మేడారం సమ్మక్క,

పూజారులు సార్లమ్మ పూజారులు,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: