CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీసు ఇనార్ఫర్మర్ జాడిబసంత్ ను ప్రజా కోర్టులో శిక్షించాం.. చర్ల-శబరి ఏరియా కమిటీ పేరున మావోయిస్టులు లేఖవిడుదల

Share it:


మన్యం న్యూస్, వెబ్ డెస్క్:

పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారిన జాడి వసంత్ ను ప్రజా కోర్టులో శిక్షించామని ప్రజా ద్రోహులకు ప్రజలే శిక్షిస్తారని పేర్కొంటూ మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరున సోషల్ మీడియా వేదికగా మావోయిస్టులు లేక విడుదల చేశారు ఈ లేఖలో ఈ విధంగా పొందుపరిచారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు మావోయిస్టు పార్టీని నిర్మూ లించే లక్ష్యంతో విప్లవోద్యమ గ్రామాలలోప్రజల అమాయకత్వాన్ని , పేదరికాన్ని అడ్డం పెట్టుకొని యువతను ఇన్ఫార్మర్ గా తయారుచేసుకుంటున్నారు. ఇన్ఫార్మార్ నెట్వర్క్ ద్వారా పోలీసులు, ప్రభుత్వా లు విప్లవోద్యమ పురోగమనాన్నిఅ డ్డుకుంటూ ప్రజల చావులకు కారణమవుతున్నారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం , ఊసూరు బ్లాక్, పూజారికాంకేర్ పంచాయితీ కొత్తపల్లి గ్రామానికి చెందిన జాడి బసంత్ ను పోలీసులు గత రెండుసంవత్స రాలుగా ఇన్ఫర్మర్ గా పని చేయిం చుకున్నారు. కొత్తపల్లి గ్రామంలోని కమిటీ నాయకులుసమచారం , పార్టీ సమాచారం ఎప్పటి కప్పుడు తెలియజేస్తూ పోలిసులు ఇచ్చిన డబ్బులనుతీసుకున్నాడు. పోలీసు మాటలు నమ్మి బసంత్ జిత్తుల మారి ఎత్తుగడలను అమలుచేశాడు.నిరంతరం పోలీసు కంట్రోల్ లో ఉంటూ పార్టీ మీటింగ్ లకు వస్తూ పూర్తి సమాచారం పోలీసులకుతెలియజేశాడు. తెలంగాణ పోలీసులకు చత్తీస్ ఘడ్ గ్రామాల రూటరుగా ఉంటూ.. పూజారి కాంకేర్ సంగం నాయకుల ఇండ్లు చూపించడం , గ్రామ ప్రజల గురించి వివరించి చెప్పాడు. దళం పై దాడిచేయిస్తే రూ.10 లక్షల ఇస్తామని ఎస్సై చెప్పడంతో దళంసమాచారం . కోసం ప్రయత్నాలు చేశాడు.ఈ విధంగా జాడి బసంత్ ప్రజా శత్రువుగా తయారు కావటం వలన పీఎల్జీఏ పట్టుకొచ్చి ప్రజా కోర్టులోవిచారించడం జరిగింది. ఈ ప్రజాకోర్టులో బసంత్ తను ఉద్యమానికి చేసిన ద్రోహం ఒప్పుకున్నాడు.ప్రజాకోర్ట్ లో మెజారిటీ అభిప్రాయం మేరకు బసంత్ కుమరణ శిక్ష విధించడం జరిగింది.పేర్కొన్నారు. ప్రజలకు ద్రోహం చేస్తే ప్రజా కోర్టులు శిక్ష తప్పదని హెచ్చరించారు.


Share it:

TELANGANA

Post A Comment: