CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోండి : ఎస్పీ డా.వినీత్.

Share it:

 


  • అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోండి : ఎస్పీ డా.వినీత్.
  • శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించవద్దు
  • నెలవారీ నేర సమీక్షా సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ.

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 27... అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించవద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు  పోలీస్ అధికారులతో నెలవారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.రౌడీ షీటర్లు,పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మరలా ఏదైనా నేరానికి పాల్పడితే వారిపై పీడీయాక్టు లను నమోదు చేయాలని సూచించారు.మట్కా,పేకాట,క్రికెట్ బెట్టింగ్ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతర నిఘా ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని అవసరమైతే పీడియాక్టులు నమోదు చేయాలని తెలిపారు.నంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాలను సీజ్ చేయాలని తెలిపారు.మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి అట్టి వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు.క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సమగ్ర నేర విచారణ జరిపి నేరస్తులకు శిక్ష పడే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కోరారు.పెండింగ్ లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.ఉద్యోగాల పేరుతో యువత మోసపోకుండా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.జిల్లా వ్యాప్తంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి,ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం జిల్లా వ్యాప్తంగా వర్టికల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు  సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్, కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు,ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి, మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, డీసీఆర్బీ సిఐ ఉపేందర్  సిఐలు,ఎస్సైలు,ఇతర సిబ్బంది పాల్గోన్నారు

Share it:

TELANGANA

Post A Comment: