CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బయో మందులతో కోట్లలో వ్యాపారం...అవగాహన లేక మోసపోతున్న రైతులు.

Share it:


*రైతుల పాలిట శాపంగా మారిన బయో మందులు.

*బయో మందుల అధిక శాతం వల్ల భూసారం తగ్గిపోతుంది అంటున్న వ్యవసాయ శాఖ నిపుణులు.

*నిర్ణయించిన ధరలకే విక్రయించాలి.

  *ఫెర్టిలైజర్స్ షాప్స్ కు పర్యవేక్షణ కరువాయ,

మన్యం న్యూస్, అక్టోబర్ 11 ,వాజేడు : 

రాష్ట్రంలో రైతులు వ్యవసాయంలో మరింత రాణించాలనే ఉదేశంతో ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోంది. ఆర్థికాభివృద్ధి సాధించాలనే సంకల్పంతో అనేక పథకాలను ప్రవేశపెట్టింది. క్షేత్ర స్థాయిలో రైతు పండిస్తున్న పంటకు ఎలాంటి మందులు పిచికారీ చేయాలనే దానిపై అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. రైతులకు వరి, పత్తి, మిర్చి తదితర పంటలకు పురుగు మందులపై అవగాహన కల్పించకపోవడంతో బయో ఫెస్టిసైడ్స్‌పై మక్కువ చూపుతున్నారు. తెలంగాణ రైతులను ఆసరాగా చేసుకొని ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులో పెద్ద మొత్తంలో బయో మందులు తయారు చేస్తున్నట్లు సమాచారం.




బయో మందులకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన గుంటూరులో కోట్లల్లో వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం తెలంగాణ రైతులకే బయో మందులు అమ్ముతున్నారు. ధరల్లో సైతం తేడా ఉండటం, మందుల పేర్లు కూడా ఒక అక్షరం తేడాతో ఒకే విధంగా ఉండటంతో రైతులు గుంటూరు వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. ఆ మందులకు ఎలాంటి గ్యారెంటీ లేకపోవడంతో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో స్థానిక మందుల దుకాణాలకు రైతులు పరుగులు పెడుతున్నారు.



భూమికి ముప్ఫే...


విచ్చలవిడిగా బయో మందులు వాడితే భూసారం తగ్గుతుందని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఎక్కువ మోతాదు ఉన్న పురుగుమందులు వాడటంతో మొక్కలు తక్కువ కాలంలోనే ఏపుగా పెరుగుతాయి. దీంతో కొద్ది రోజుల్లోనే మొక్కలు ఎరుపెక్కుతాయి. అధిక మోతాదులో ఉన్న రసాయనాలతో కూడిన మందులు పిచికారీ చేయడంతో మొక్కలకు రోగ నిరోధక శక్తి తగ్గుంది.ఎలాంటి రోగాలు ఆశించినా తట్టుకోలేవు. పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది.


వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలి..


అధికారులు బయో మందుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రైతులకు పురుగు మందుల వాడకంపై అవగాహన కల్పించాలి. బయో మందులను తెచ్చే రైతులపై నిఘా ఏర్పాటు చేసి మందులను నిషేధిస్తే రాబోయే రోజుల్లో రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో బయో మందుల వాడకంపై నిషేధం విధించి, సేంద్రియ వ్యవసాయం వైపు అడుగిడే విధంగా చర్యలు తీసుకోవాలి.




వివిధ మండలాల నుంచి గుంటూరుకు...


వరంగల్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా జిల్లాలలోని మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఫెర్టిలైజర్ షాప్ లల్లో అందుబాటులో ఉండటంతో రసాయన మందులను కొనుగోలు చేస్తున్నారు. ఫెర్టిలైజర్ షాప్ నిర్వాహకులు బయో మందులు తెచ్చి రైతులకు అమ్ముతున్నారు. వాజేడు, వెంకటాపురం మండలాలలో ఇష్టానుసారంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నరు. ఫెర్టిలైజర్ షాపులపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కానీ సంబంధిత అధికారులు నిమ్మకు నేరెత్తని విధంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: