CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అయ్యా.. మా గోడు వినండి

Share it:


మన్యం న్యూస్,ఇల్లందు(అక్టోబర్30):

ఇల్లందు మండల పరిధిలోని ఇల్లందు , బొజ్జయిగుడెం , రొంపెడు లోని  అన్ని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వైజ్ వర్కర్స్ అందరూ కూడా తమ డిమాండ్ల తో నిరవదిక సమ్మెకు దిగారు తమలో కొంతమంది 25 సంవత్సరాలు గా ఈ వృత్తిలో కొనసాగుతున్నారు అటువంటి  అర్హులైన వారినీ మానవత్వం చూపి రెగ్యులరైజ్ చెయ్యాలి , 2020 పీఆర్సీ ప్రకారం 30% జీతాలు పెంచాలి, అదే విధంగా తమకు పని చేస్తున్నప్పటికి సంవత్సర కాలం గా జీతం ఇవ్వటం లేదు కనుక బకాయి జీతాలు వెంటనే చెల్లించాలి ,చనిపోయిన డైలీ వైజ్ వర్కర్స్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి , హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి , ప్రసూతి కాలంలో మహిళలకు సెలవులు ఇవ్వాలి అనే డిమాండ్లతో సమ్మెకు దిగారు అలాగే తమ డిమాండ్లకు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుంది అని తెలియజేశారు , ప్రభుత్వం మా తో చర్చలు జరిపి మా సమస్యలు పరిష్కరించి, హాస్టల్స్ సక్రమంగా నడిచేలా చూడాలని కోరారు .

Share it:

TELANGANA

Post A Comment: