CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వీ ఆర్ ఏ ల నిరవధిక సమ్మె తాత్కాలిక వాయిదా

Share it:


  •  వీ ఆర్ ఏ ల నిరవధిక సమ్మె తాత్కాలిక వాయిదా
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన వీ ఆర్ ఏ ల నిరవధిక సమ్మె ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని రాష్ట్ర వీఆర్ఏల సంఘం నాయకులు తెలపడంతో,

ములుగు జిల్లా మంగపేట మండలంలో కూడా వీఆర్ఏ ల నిరవధిక సమ్మె  బుధవారం వాయిదా వేశారు. ఈ సందర్బంగా మంగపేట మండల వీఆర్ఏ ల అధ్యక్షులు పాగా బాబు, ఉపాధ్యక్షులు కర్రి నాగార్జున, ప్రధాన కార్యదర్శి కర్రి నరసింహ మూర్తి మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ తో రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నాయకులతో జరిగిన చర్చలలో వీఆర్ఏ ల హామీలను నవంబర్ 7 తర్వాత అమలు చేస్తామని తెలిపారు.ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున హామీలను ఎలక్షన్ తర్వాత చేస్తామని చెప్పడంతో తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తునట్లు ప్రకటించారు, రాష్ట్ర జేఏసీ ఆదేశాల మేరకు మేము సైతం తాత్కాలిక విరమణ ప్రకటిస్తున్నాం, నవంబర్ 7 తర్వాత మరల మా కార్యాచరణ ప్రకటిస్తాం, ఈ సందర్బంగా వీఆర్ఏ ల నిరవధిక సమ్మెకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.

            ఈ కార్యక్రమంలో వీఆర్ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు , నర్సింహారావు,గౌసియా బేగం, సమ్మయ్య,రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను,మాధవి,ఖాజా హుస్సేన్,కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: