CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిరంతర సేవా కార్యక్రమాలు అభినందనీయం పలువురి ప్రశంసలు అందుకుంటున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్

Share it: ములుగు జిల్లా, మంగపేట మండలం,  లక్ష్మీ నరసాపురం- రాజుపేట గ్రామానికి చెందిన

 బాడిశ రామకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ స్థాపించారు.

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ రథసారథి గా బాడిశ.రమేష్ ను నియించారు .

ఈ సంస్థ స్థాపించిన అనతికాలంలోనే నిరంతర సేవా కార్యక్రమాల ద్వారా యువకుడైన బాడిశ.రమేష్ ఆధ్వర్యంలో శ్రీ రామకృష్ణ సేవాట్రస్ట్ ప్రతిరోజు ములుగు జిల్లా వ్యాప్తంగా

రోజు ఏదో ఒక కార్యక్రమం చేపడుతూనే ఉన్నారు, ఈ విధంగా  చిన్న వయసులోనే ములుగు జిల్లా వ్యాప్తంగా అధికారుల నుండి రాజకీయ నాయకుల నుండి ప్రజల నుండి ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన్యం మనుగడ మంగపేట ప్రతినిధి మైపా శంకర్ శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ రథసారథి బాడిశ.రమేష్ ను కలవడం జరిగింది.


: ప్రతినిధి :

నమస్కారం రమేష్ గారు, బాగున్నారా ముందుగా మీకు నన్ను పరిచయం చేసుకుంటాను నేను మన్యం మనుగడ ప్రతినిధిని మంగపేట.


: రమేష్:

 బాడిస రమేష్ నవ్వుతూ శంకర్ అన్న, మీరు తెలుసు మీ పేపర్ తెలుసు ముఖ్యంగా మా ఆదివాసీల తరపున మా మన్యం ప్రజల తరఫున ఒక  పత్రికను స్థాపించి ఆదివాసీల సమస్యలపై పోరాటం చేస్తున్న ప్రభుత్వ విప్ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం తెరాస పార్టీ అధ్యక్షులు, మన్యం టీవీ, మన్యం మనుగడ సంస్థల చైర్మన్ రేగా కాంతారావు గారికి ధన్యవాదాలు.

 : ప్రతినిధి :

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు ద్వారా మీ సేవా కార్యక్రమాలు నిరంతరం అందించి ప్రజలకు చేరువ అవుతున్నారు చాలా సంతోషం  కానీ ఇలా ఎంతకాలం కొనసాగించగలరు?దీనికి మీకు ఉన్న ఆర్థిక స్తోమత సరిపోతుందా??

రమేష్:

మాకు ఉన్న ఆర్థిక వనరులు అంటే ప్రజలు దేవుడు ప్రసాదించిన వనరులు , మా కుటుంబీకులు అందరం, మనస్ఫూర్తిగా తాతల ద్వారా సంక్రమించిన దేవుని  సేవల ద్వారా ఇలా మాకు ఉన్నదంట్లోనే పేదల కోసం అనాథలు, అన్నార్తులు, ఇతర కారణాల ద్వారా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవటం జరిగింది..

మీరన్నట్లు నిరంతర సేవా కార్యక్రమాలకు మాకు ఉన్న ఆర్థిక స్తోమత ఆర్థికవనరులు సరిపోవు కానీ మాకు ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మేము సైతం పాల్గొంటాము అంటే అప్పుడు తప్పకుండా వారి సేవలు కూడా ప్రజల కోసం ఉపయోగిస్తాము

ప్రతినిధి :

వాస్తవానికి మీరు ఆదివాసి  దేవతరాధకులు కదా! మీరు మరలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం ఎందుకు చేపడుతున్నారు?

రమేష్ :

మా వంశ పూర్వీకుల నుండి శ్రీ నాగులమ్మ దేవతారాధన మాకు వారసత్వంగా వస్తున్నది... మా తాతలు మా నాన్న,నేను అందరం శ్రీ నాగులమ్మ దేవత, ఆ తల్లి సేవ చేస్తున్నాం ఇందులోనే తరిస్తున్నాం, ఇందులో భాగంగానే మానవ సేవ మాధవ సేవ అని తలచి పేదల కోసం నిరంతర సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ భాగ్యం శ్రీ నాగులమ్మ తల్లి కృపాకటాక్షాలు మేరకు తల్లి ఆశీర్వాదం మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి.

ప్రతినిధి :

 ఒక వివాదాస్పద ప్రశ్న ఇబ్బంది లేకుంటే సమాధానం ఇవ్వండి లేదంటే వద్దు!

 మీరు ఇన్ని ప్రజల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు బాగానే ఉంది  కానీ దీనికి వెనుక ఏదో బలమైన కారణం గానీ కోరిక కానీ ఉందా??

రమేష్ :

ఎటువంటి బలమైన కారణం లేదు, స్వలాభాపేక్ష లేదు ఆపదలో ఉన్నవారిని రోగులను అనాధలను అన్నార్తులను ఆదుకోవడం అంటే సాక్షాత్తు ఆ మహాతల్లి కి చాలా ఇష్టం అందుకే మరలా చెప్తున్నాను మానవ సేవే మాధవ సేవ  అని నమ్మి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ నా తండ్రి శ్రీ బాడిశ.రామకృష్ణ స్వామీజీ శ్రీ నాగులమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ స్థాపించారు, ఆయన గారి ఆశయాల మేరకు శ్రీ నాగులమ్మ తల్లి ఆశీస్సులతో ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నాం.

ప్రతినిధి :

చివరగా ఒక ప్రశ్న నా ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు అందుకే సూటిగా అడుగుతున్నాను మీరు ఏదైనా రాజకీయ పార్టీల నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి పేరు కోసం సేవా కార్యక్రమం చేస్తున్నారా?

రమేష్:

 ప్రస్తుతం నాకు అటువంటి ఆలోచన లేదు. మా లక్ష్యం,మా ఆశయం ఒక్కటే నాకు ఓపిక ఉన్నంత వరకు శ్రీ నాగులమ్మ తల్లికి సేవలు చేయడం.రెండవది ప్రజల కోసం శ్రీ రామకృష్ణ సేవాట్రస్ట్ కొనసాగించటం.

ప్రతినిధి:

 మీరు ఓపికతో మాకు సహకరించినందుకు ధన్యవాదాలు.

రమేష్ :

మీకు కూడా ధన్యవాదాలు మీ ద్వారా మాకు ప్రజలతో మా భావాలను పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

 మన పత్రిక ద్వారా ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సర్వేజనా సుఖినోభవంతు శుభంభూయాత్


ఇట్లు :

మైపా.శంకర్ మంగపేట

 మన్యం మన్యం, టీవీ ప్రతినిధి ములుగు జిల్లా 506172

సెల్ నెంబర్ 9494284029

Share it:

TELANGANA

Post A Comment: