CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సోషల్ ఆడిట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా బైట పడని లక్షల అవినీతి, పేదల సొమ్ముపై అధికారులు చేతివాటం

Share it:


 సోషల్ ఆడిట్ సిబ్బంది  నిర్లక్ష్యం కారణంగా బైట పడని లక్షల అవినీతి, పేదల సొమ్ముపై అధికారులు చేతివాటం 

👉 ప్రజాప్రతినిధులు రీ-ఆడిట్ పెట్టమని కలెక్టర్ కు పిర్యాదు చేసినా స్పందించని జిల్లా అధికారులు. 

 👉 లక్షల రూపాయల దుర్వినియోగం జరిగినా ఉన్నతాధికారులు స్పందన శూన్యం,ఓపెన్ ఫోరమ్ రోజు కూడా గ్రామ పంచాయతీ ల్లో గ్రామ సభలు ఎలా నిర్వహించారు 

  మన్యం న్యూస్:ములకలపల్లి:(అక్టోంబర్ 26):మండలం లొ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామజికతనిఖీ ల్లో మండలం లొ నిర్వహించిన ఓపెన్ ఫోరమ్ లొ పగలు జరిగిన ఓపెన్ ఫోరమ్ లో 13లక్షలు అవినీతి వెలికితీత, రాత్రి జరిగిన ఓపెన్ ఫోరమ్ లో 3 లక్షల అవినీతని  అధికారులు ధ్రువీకరించారని,ఉపాధి హామీ కార్మిక సంఘం అధ్యక్షుడు నరాటి ప్రసాద్ ఆరోపించారు.మండలం లో  మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల కు చెందాల్సిన 23 కోట్ల రూపాయలు పనుల్లో లక్షల రూపాయలు అవినీతి చేసి ఇ జి ఎస్ అధికారులు పంది కొక్కుల్లా దిగమింగారని,ఉపాధి హామీ కార్మిక సంఘం (బి కె ఎమ్ యు ) అనుబంధం  జిల్లా అధ్యక్షులు నరాటి ప్రసాద్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.మండలంలో 23కోట్ల రూపాయలు వెచ్చించి పేద ప్రజలకు ఉపాధి హామీ పథకం కింద పేదల కడుపునిండా అన్నము పెట్టాలని ప్రభుత్వం తలిస్తే, స్థానిక సిబ్బంది చేతివాటం ప్రదర్శించి లక్షల్లో ప్రజల సొమ్ము స్వాహా చేశారు.సోషల్ ఆడిట్ కోసం వచ్చిన సిబ్బంది గ్రామాల్లో ఉపాధి పనులు కి వెళ్లిన కూలీలను నేరుగా కలవకుండా జరిగిన పనులు సందర్శించడం కొలతలు తీసుకోకుండా తూతుమంత్రంగా ఆడిట్ చేశారని,100 శాతం కూలీలను కలవకుండా కేవలం 40శాతం మంది ని మాత్రమె కలిసి విచారణ చేపట్టారని, 20 గ్రామ పంచాయతీ లో ప్రజాప్రతినిధులు చొరవతో 10 లక్షల అవినీతి బైటకు వచ్చిందని తెలిపారు.కొన్ని పంచాయతీల్లో కూలీలు పనులు జరిగిన ప్రాంతంలో సోషల్ ఆడిట్ సిబ్బంది స్థానిక ఇజిఎస్ స్టాఫ్ తో లాలూచీ పడి నిర్దిష్టంగా ఆడిట్ చెయ్యకుండా సహకారం అందించారని అన్నారు.ఓపెన్ ఫోరమ్ సందర్భంగా పట్టుమని పదిమంది కూడా కూలీలు రాకుండా ప్రజాప్రతినిధులు లేకుండా ఎపిడి  సుబ్రహ్మణ్యం, స్థానిక ఎంపీడీఓ, ఇజిఎస్  కార్యాలయ సిబ్బంది  తెల్లవారు లు ఓపెన్ ఫోరమ్ ఎలా నిర్వహించారో చెప్పాలని అన్నారు. స్థానిక అవినీతి అక్రమాలపై విచారణ రీ-ఆడిట్ చెయ్యాలని కలెక్టర్ కు ప్రజాప్రతినిధులు వినతిపత్రాన్ని అందించినా, పేపర్లు మీడియా లో అవినీతి పై కోడైకూసిన జిల్లా కలెక్టర్లు ఎందుకు విచారణ కు ఆదేశించలేదో అర్ధంకావటం లేదని,ప్రజల్లో లక్షల అవినీతి లో క్రింది అధికారులు నుంచి జిల్లా స్థాయి అధికారులకు భాగస్వామ్యం ఉందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో,సత్వరం కలెక్టర్ ములకలపల్లి ఇజిఎస్ లో జరిగిన అవినీతి ఆరోపణలు పై సమగ్ర విచారణ జరిపించాలని, ఉపాది హామీ కార్మిక సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి ఎండీ యూసుఫ్,ఎంపీటీసీ కొర్రీ భద్రం, కోఅప్సన్ మెంబెర్సభ్యులు ఎస్ కె జబ్బర్,సాయి,వీరు,వెంకట రమణ, రజని,రాములమ్మ,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: