CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కలెక్టర్ సర్క్యులర్ కు తూట్లు- తుడుందెబ్బ.

Share it:



  • కలెక్టర్ సర్క్యులర్ కు తూట్లు- తుడుందెబ్బ.
  • అధికార పార్టీ నాయకుల కనుసన్నుల్లో అధికారులు*
  • గిరిజనుల మధ్య గొడవలు సృష్టిస్తున్న వైనం                                  

మన్యం న్యూస్, అక్టోబర్ 26,.వాజేడు:                                                 

ములుగు జిల్లాలోని వాజేడు మండలంలోని గోదావరి నది తీరా గ్రామాల్లో కొత్త ఇసుక సొసైటీల పేసా గ్రామ సభల కోసం మండల స్థాయి అధికారులకు ఒత్తిడి చేసి తప్పుడు మార్గంలో గ్రామ సభలు పెట్టించి ఆదివాసీల ఇసుక సంపదను దోసుకు పోవటానికి కుట్రలు చేస్తున్నారని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కార్యదర్శి కాపుల సమ్మయ్య ఆరోపించారు

గోదావరి తీర ప్రాంత గ్రామాల్లోని ఆదివాసీ ప్రజలకు డబ్బు మద్యం ఎరగా చూపుతూ గ్రామాల్లో గిరిజనులకు మధ్య గొడవలు పెట్టిస్తు అధికార బలంతో పేసా గ్రామ సభలను వారి వైపుగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 జిల్లా కలెక్టర్,05.07.2022 రోజున ఒక గ్రామంలో ఒక సొసైటీ సర్క్యులర్ ను కింది స్థాయి అధికారులు అమలు చేయకుండా అధికార పార్టీ నాయకుల కనుసన్నుల్లో ఉంటూ వారి అండదండలతోనే  కలిసి ఉండే గిరిజన ప్రజలను విడగొడుతూ గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు. 

నేటికి గోదావరి తీరా ప్రాంత గ్రామాల్లో ఒకటి రెండు ఇసుక సొసైటీలు ఉన్నప్పటికీ మరో కొత్త సోసైటిల కోసం పేసా గ్రామ సభలు పెట్టె ప్రయత్నం చేయటమే గిరిజన గ్రామాల్లోని ప్రజల మధ్య విభేదాలు సృష్టించే కార్యక్రమం కదా అని ప్రశ్నించారు  సహకార సంఘాల చట్టం ప్రకారం ఒక సభ్యుడు ఒక సొసైటీలలో మాత్రమే ఉండాలని చట్టం చెప్తున్నప్పటికి  ద్వంద్వ సభ్యత్వం చేసే విదంగా చట్టాన్ని నీరు గారుస్తున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ సర్క్యులర్ ను అమలు చేయకుండా గ్రామ సభలు నిర్వహించి కొత్త సొసైటీలు చేయాలని చూస్తే ఉన్నత న్యాయస్థానం హేకోర్టు ను ఆశ్రయించక తప్పదని హెచ్చరించారు  కొత్త సొసైటీల పేసా  గ్రామ సభల గురించి జిల్లా కలెక్టర్ గారు విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలని వెంటనే కొత్త సొసైటీల ఏర్పాటుకు వచ్చిన పేసా  గ్రామ సభలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈకార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు మడకం. చిట్టిబాబు. చింత సోమరాజు.పొడెం.నర్సింగరావు. సమ్మయ్య.కృష్ణ గారులు పాలుగొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: