CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వైద్యులు అంకిత భావంతో సేవలు అందించాలి

Share it:


మన్యం న్యూస్, ములుగు:

  • డిపిఓ,డిసిఓలపై  తీవ్ర ఆగ్రహం
  • పద్దతిమార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని  డిసిఓకు హెచ్చరిక.
  • కార్యదర్శులు,ఎంపిఓలు నిబద్దతతో పనిచేయాలని,
  • విధి నిర్వహణలో అధికారులు రాజకీయాలు చేయవద్దని, 
  • రాజకీయాలు చేయాలనుకుంటే అధికారులు ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలని,
  • మనఊరు బడి పనులలో నాణ్యతలోపిస్తే సహించేది లేదని అన్నారు.
  • విద్యాశాఖలో అక్రమ డిప్యూటేషన్లను పూర్తిగా రద్దు చెయ్యాలని అన్నారు. 
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉపాధి హామి కూలీ చెల్లింపులు సక్రమంగా నిర్వహించాలని,

 స్థాయి సంఘం సమావేశంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అన్నారు. వైద్యులు రోగలు పట్ల అంకిత బావంతో సేవలు అందించాలని  ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్  అన్నారు. ఈ మేరకు ములుగు జడ్పీ కార్యాలయంలో శనివారం రోజున స్థాయి సంఘం సమావేశాలు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన జరిగాయి. ఈ సమావేశాల్లో బాగంగా 1,2,3,4,5,6,7 స్థాయి సంఘం సమావేశాలు  ఆయా  సంఘాల చైర్మన్ లు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్, జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి ,వెంకటాపురం జడ్పీటిసి పాయం రమణ , ములుగు జడ్పీటిసి సకినాల భవానిలు చైర్మన్ లుగా పాల్గొనగా గోవిందావుపేట జడ్పీటిసి హరిబాబు, కోఆప్షన్ సభ్యులు వలీయాబి,రియాజ్ మిర్జా,కన్నాయిగూడెం జడ్పీటిసి కరం చంద్ గాంధీ, వెంకటాపూర్ జడ్పీటిసి రుద్రమ దేవి,వాజేడు జడ్పీటిసి తల్లాడి పుష్పలతలు స్థాయి సంఘం  సభ్యులుగా పాల్గొన్నారు.ఈ సమావేశాల్లో జిల్లా పంచాయితి  విభాగం,జిల్లా కోఆపరేటీవ్,విద్యాశాఖ , భూగర్బ గనుల శాఖ,జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ,జిల్లా  గ్రామీణాబివృద్ది శాఖ,జిల్లా పశు సంవర్థక,జిల్లా వ్యవసాయ,అటవీశాఖ,   ఎక్సైజ్ విభాగం, ఇంజనీరింగ్ విభాగం తదితర  అంశాలపై చర్చిండడం జరిగింది.  ఈసందర్బంగా ఆశాఖలపై జరిగిన సమావేశాల్లో జిల్లా పంచాయితి విభాగం అధికారి వెంకయ్య శాఖకు  సంబంధించి నివేదికను తెలుపగా ములుగు జిల్లాలో కార్యదర్శుల, ఎంపిఓ ల పనితీరుపై జడ్పీ చైర్మన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.విధి నిర్వహణలో పంచాయితి అధికారులు నిబద్దతతో , తమతమ పరిధులలో  పనిచేయాలని, విధి నిర్వహణలో రాజకీయాలు చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని తప్పా ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.జిల్లా కోఆపరేటీవ్ విబాగం తరపున జిల్లా అధికారి లాల్ నివేదికను తెలుపగా సహాకారసంఘాల రిజిస్ర్టేషన్ల విషయంలో ఆ శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి మందలించిన  జడ్పీ చైర్మన్ అది అలాగే కొనసాగితే అతనిపై శాఖాపరమైన చర్యలు తప్పవని జడ్పీ చైర్మన్ తీవ్రంగా  హెచ్చరించారు. పద్దతి మార్చుకోకపోతే  సెలవుపై వెళ్లాలని  సూచించారు. జిల్లా విద్యాశాక తరపున జిల్లా  విద్యాశాఖా అధికారి ఫాణిని హాజరై నివేదికను తెలిపిన అనంతరం ములుగు జిల్లాలో విద్యాశాఖలో  నిబంధనలకు  విరుద్దంగా జరుగుతున్న  అక్రమ డిప్యూటేషన్లను పూర్తిగా  రద్దుచేయాలని లేదంటే సహించేది  లేదని సూచించారు. ఈఅక్రమడిప్యూటేషన్ల  మూలంగా మారుమూల గ్రామాలలో విద్యా వ్యవస్థ కుంటుపడి నిరుపేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని అన్నారు.మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులలో నాణ్యత  లోపిస్తే సహించేదిలేదని క్వాలిటికంట్రోల్ శాఖచే పరిశీలన చేపించాలని సూచించారు.జిల్లా గ్రామీ ణాబివృద్ది శాఖ తరపున జిల్లా అధికారిణి నాగపద్మజ హాజరై నివేదిక సమర్పించగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉపాధి హామి చెల్లింపులలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు, డిపిఎంలు విధిగా విధులు నిర్వర్తించే విధంగా వారిపై నిఘా పెంచాలని సూచించారు.పెన్షన్ల చెల్లింపులలో ఏలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలన్నారు.సివిల్ సప్లై విబాగం తరపున జిల్లా అధికారి అరవింద్ రెడ్డి హాజరవ్వగామిల్లుల సంఖ్యను పంట దిగుబడులకు అనుగుణంగా పెంచుతూ మిల్లుల సామర్థ్యాన్ని కూడా పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్ వాడీ సెంటర్ లలో పోషకాలతో కూడిన బియ్యాన్ని విధిగా సరఫరా చేయాలన్నారు. జిల్లా అటవి శాఖ చర్చలోభాగంగా పోడు  భూముల పట్టాలు అందించే కార్యక్రమంలో  ప్రభుత్వ ఆశయాలను నీరు గార్చకుండా ప్రజలకు న్యాయం జరిగేలా పారదర్శకంగా సర్వే నిర్వహించాలన్నారు.జిల్లా ఎక్సైజ్  విభాగం చర్చలో కల్తీ మద్యాన్ని అరికట్టాలి సూచించారు. అదే  విదంగా ఈ స్థాయి సంఘం సమావేశాలలో వివిధ శాఖలపై పూర్తిగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ సిఇఓ ప్రసూన రాణి, కార్యాలయ సిబ్బంది ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: