CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఓటు హక్కు కూడా లేని ..వార్డుకి సరిపోని వారికి కొత్తగూడెం నియోజకవర్గం పీసీసీ గా బాధ్యతలా..? ఇ ఆగ్రహం వ్యక్తం చేసిన :సీనియర్ కాంగ్రెస్ నాయకులు: రాయల శాంతయ్య

Share it:


 ఓటు హక్కు కూడా లేని ..వార్డుకి సరిపోని వారికి కొత్తగూడెం నియోజకవర్గం పీసీసీ గా బాధ్యతలా..? ఇ ఆగ్రహం వ్యక్తం చేసిన :సీనియర్ కాంగ్రెస్ నాయకులు: రాయల శాంతయ్య

తక్షణం వీరిని పీసీసీ సభ్యులుగా తొలగించాలి :కొత్తగూడెం టౌన్ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 16.. ఫోటో కూడా లేని వాటికి సరిపోయే వారికి కొత్తగూడెం నియోజకవర్గం బీసీ గా బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు న్యాయమని తక్షణమే వారిని పిసిసి సభ్యులుగా తొలగించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు బొమ్మిడి మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెం నియోజకవర్గం బస్టాండ్ సెంటర్లోని రైటర్ బస్తీలో గల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో   ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. పీసీసీ సభ్యుల నియామకం పై బ్లాక్ కి సంబంధం లేని , ఓటర్ లిస్ట్ 

లో లేని అభ్యర్థుల ను పిసిసి సభ్యులు గా నియమించడం విచారకరమన్నారు. పాల్వంచ, కొత్తగూడెం లో బీఆర్ ఓ లు , డి ఆర్ వో ల సమక్షంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తూ నియోజక వర్గానికి సంబంధం లేని వ్యక్తులను,  కాంగ్రెస్ సభ్యులు, ఎన్రోలర్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా , కాంగ్రెస్ ఎన్నికల నియమావళి కి వ్యతిరేకంగా కొత్తగూడెం నియోజక వర్గంలో నియమించడం పూర్తిగా కాంగ్రెస్  ఎన్నికల నియమావళి కి విరుద్ధమన్నారు, స్థానిక నాయకులు , సభ్యత్వ నమోదు ఇంచార్జిలుఅయిన వారిని తప్పు ద్రోవ పట్టించిన తీరు ఆక్షేపనీయం అన్నారు. ఇది కార్యకర్తలు , సభ్యత్వ నమోదు, చేసిన వారందరం బాధపడుతూ పిసిసి వారికి , కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం మధుసూధన్ మిస్త్రీ కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.దీని మీద విచారణ పూర్తయ్యే వరకు కొత్తగూడెం ఏ , బి,బ్లాక్ లకు నియమించబడిన, పోట్ల నాగేశ్వర రావు  జేబీ శౌరీ ల ను తొలగించి వారి ఇచ్చిన గుర్తింపు కార్డ్ లను రద్దు చేసి దీని మీద విచారణ పూర్తయ్యే వరకు ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి అనర్హులు గా పరిగణించాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.  .జరిగిన పి సి సి సభ్యుల ఎన్నిక ప్రక్రియ మీద ఏఐసిసి విచారణ జరిపి సంబందించిన బిఆర్ఓ లు విఆర్ఓ లు సహకరించిన నాయకులు అజ్ఞాత శక్తుల ను పార్టీ నుండి సస్పెండ్ చేసి కొత్తగూడెం ఏ , బి,బ్లాక్  పి సి సి సభ్యులను నమోదు అయిన సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నియమించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో డిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లి, కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని హెచ్చ రించారు . కొత్తగూడెం నియోజకవర్గంలో టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో నలభై అయిదు వేల సభ్యత్వాలు మండుటెండను సైతం లెక్కచేయకుండా ఏఐసీసీ పీసీసీ ఆదేశాలకు కట్టుబడి సభ్యత్వాలు చేపించి పది లక్షల రూపాయలు గాంధీ భవన్ లో కట్టడం జరిగిందన్నారు.పార్టీ ఆదేశానుసారం తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమము చేసుకుంటూ నిత్యం ప్రజలతో మమేకమవుతు కాంగ్రెస్ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళుతున్నామని,అదే విధంగా రైతు రచ్చబండ కార్యక్రమము ప్రతీ గ్రామముకు ఎడవల్లి నాయకత్వంలో పీసీసీ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీని బలపరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏ విధంగా లబ్ది చేకూరుతుందని, డిక్లరేషన్ కరపత్రాలు రైతులకు ఇచ్చి వివరించడం జరిగిందన్నారు,కానీ నియోజకవర్గము కానీ వారికి కనీసం ఓటు హక్కు లేని వారికి వార్డుకి పనికి రాని వారికి పీసీసీ సభ్యులుగా నియమిచడం పై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు, నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఇచ్చే పోరాటం చేస్తామన్నారు.,పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి,పీసీసీ జనరల్ సెక్రెటరీ మహేష్ కుమార్ గౌడ్ కి,మాజీ మంత్రి,ప్రస్తుత సీనియర్ పీసీసీ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ కి ,మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరికి ఇట్టి విషయం కోసం ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు,అలా జరగని పరిస్థితిలో ఢిల్లీ కి వెళ్లి ఏఐసీసీ కి ఫిర్యాదు చేయడం జరుగుతుందని శాంతయ్య, మల్లికార్జున్ తెలిపారుఈ సమావేశంలో చుంచుపల్లి మండల అధ్యక్షులు అంథొటి పాల్, లక్మిదేవిపల్లి మండల అధ్యక్షులు సకినాల వెంకటేశ్వరావు,కొత్తగూడెం పట్టణ మైనార్టీ అధ్యక్షురాలు జేరిన, లక్మిదేవిపల్లి మండల ఎస్సి సెల్ అధ్యక్షులు కొప్పుల రమేష్,లీగల్ సెల్ నాయకులు అరికెల కరుణాకర్, టౌన్ మహిళ నాయకురాలు వాలి, ఐ ఎన్ టి యు సి నాయకులు కాలం నాగభూషణం,కాంగ్రెస్ నాయకులు పంచాల నాగభూషణం, జక్కుల శ్రీనివాస్, మట్టపర్తి వెంకటేశ్వర్లు,గడ్డిగుట్ట నరేష్,శనగ లక్ష్మణ్,భూక్య శ్రీనివాస్,ఫైజుద్దీన్, రముర్తి,సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: