CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విలేఖరి పై దాడిని ఖండించిన వైయస్సార్టీపి నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్

Share it:


 మన్యం న్యూస్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, వాగొడ్డు గూడెం గ్రామంలో ఆదివాసి గిరిజనులకు ఫారెస్ట్ అధికారులకు మధ్యన జరిగిన పోడు పోరులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంపత్ విలేఖరి పై దాడి చేసి, తన ఫోన్ లాక్కుని జీపులో ఎక్కించే ప్రయత్నం చేసిన ఘటనలో పత్రికా స్వేచ్ఛకు ఆటంకం కలిగిన నేపథ్యంలో, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సంపత్ ను అరెస్టు చేయడంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ, ఇలాంటి మీడియా పాత్రికేయులపై వారి స్వేచ్ఛకు అవరోధం కలిగిస్తూ తిరగబడడం హేయమైన చర్యగా భావించి, హైకోర్టు న్యాయవాది- వైఎస్సార్టీపీ నాయకుడు పెనుబల్లి రమేష్ తీవ్రంగా ఖండించారు. అలాగే ఆదివాసి గిరిజన పుత్రులపై దాడులు చేయడం అన్యాయమని, 140 జీవో ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారో గ్రహించి, కోర్టులో విచారణలో ఉన్న పోడు భూముల వ్యవహారంలో అత్యుత్సాహం చూపిస్తూ కొందరు ఫారెస్ట్ అధికారులు తమ జులుం ఝులిపించడం ఏమాత్రం న్యాయమంటూ ఫారెస్టు అధికారులను ప్రశ్నించారు. తదనంతరం కావాలనే ఫారెస్ట్ అధికారులు గిరిజనులను రెచ్చగొట్టి, కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించే ఉద్దేశంతో చేస్తున్న దాడులపై మండిపడ్డారు. అసలే పొట్ట చేత పట్టుకుని కాలం గడుపుతున్న గిరిజన బతుకులు కోర్టుల చుట్టూ తిరిగి, విసిగి వేసారిపోయే పరిస్థితులు దాపురించక ముందే, కాస్త ఓపికతో ప్రభుత్వం తమకు న్యాయం చేసేంతవరకు వేచి చూడాల్సిందేనని తెలియపరిచారు. పోడు భూములలో నుండి వెళ్లిపోవాల్సింది గిరిజనులు కాదంటు, ఫారెస్టు అధికారులను తరిమే రోజులు రానున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: