CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జాతీయ మహాసభలకు కదిలిన సిపిఐ శ్రేణులు.. జూలూరుపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ..

Share it:


జూలూరుపాడు, అక్టోబర్ 14, (మన్యం న్యూస్) : సిపిఐ జాతీయ మహాసభలు విజయవాడలో 14 వ తేదీ నుంచి 18 వరకు జరుగుతున్న నేపథ్యంలో జూలూరుపాడు మండల కేంద్రంలో  ప్రధాన రహదారిపై సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్పోరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతున్నారని, నిత్యవసరాల ధరలు పెంచడం వలన సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని అన్నారు. కమ్యూనిస్టు పార్టీలు లేకపోతే దేశాన్ని బీజేపీ దోచుకుంటుందని, కేంద్ర ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఏకీకరణ కోసం విజయవాడ మహాసభ  కేంద్ర బిందువు కానున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎల్లంకి మధు, పొన్నెకంటి వెంకటేశ్వర్లు, ఎస్కే నాగుల్ మీరా, హలవత్ బద్రు, వలమల సామేలు, గుండె పిన్ని మధు, కిలారి ముత్యాలు,  యాస రోశయ్య, గార్లపాటి వీరభద్రం, గార్లపాటి శివకృష్ణ, కోటే  శీను, కొండ వీరయ్య, భూక్యా బద్రు, బానోత్ బాలు, భూక శంకర్, మాలతు శ్రీను, చలమల నరసింహారావు, ఎస్.కె చాంద్ పాషా, పగడాల అఖిల్, పసుపులేటి పవన్, ఎస్కే సమీర్, బడుగు వీరస్వామి, దర్శనాల వెంకటేశ్వర్లు,  దినేష్, అప్పికట్ల ప్రసాద్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: