CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగుదారులందరికి పట్టాలు ఇవ్వాలి. 👉 సిపిఐ ఎంఎల్ ప్రజాపథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము.

Share it:


మన్యం న్యూస్:దమ్మపేట:(అక్టోంబర్10) :

సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కమిటీ ఆధ్వర్యంలో పార్కెలగండి, పాకల గూడెం, కొత్తూరు, చిల్ల గుంపు , గ్రామాల లో పొడుభూమి సదస్సులు నిర్వహించడం జరిగింది.ఈ సదస్సులో సిపిఐ ఎంఎల్ ప్రజాపథా పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము మాట్లాడుతూ, ఎన్నో పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కారానికి పూనుకోవడం, రాష్ట్రస్థాయిలో కమిటీ వేయడం, జిల్లా స్థాయిలో కూడా అధికారులను సమాయత్తం చేయటం జరుగుతుందని,ఈ కార్యక్రమం సరైన పద్ధతిలో సమగ్రంగా జరగటం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి .

కేవలం మంత్రులు, అధికార పార్టీ, ప్రజాప్రతినిధులు , అధికార యంత్రాంగం,అటవీ,రెవెన్యూ,పోలీసు అధికారులు మాత్రమే భాగస్వాములు చెయ్యటం స్థానిక ప్రజా ప్రతినిధులను ఎఫ్ ఆర్ సి లను పోడు పోరాట ఉద్యమ సంఘాల భాగస్వామి లేకపోవడం లోపం , నష్టం, అందువలన ఈ కార్యక్రమం ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అవినీతి అవకతవకలకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో సర్వే జరిపి వాస్తవిక సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గతంలో కూడ సాగు సంబంధం లేని వారికి పట్టాలు ఇచ్చి అసలు సాగు దారులకు పట్టాలు ఇవ్వలేదని, అలాంటి అవకతవకలు అక్రమాలు జరగకుండా పారదర్శకంగా సర్వే చేయాలని,అసలైన పోడు సాగుదారులకి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.పోడు భూముల సర్వే పరిశీలన బృందంలో స్థానిక ప్రజాప్రతినిధులు FRC లను భాగస్వాములను చేయాలని, ఆదివాసీలు ఇతర పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూముల అన్నిటికీ హక్కులు  కల్పించాలని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని, నేటికీ సాగుతూన్న పోడు భూములపై అటవీ అధికారులు చేస్తున్న దాడులు, దౌర్జన్యాలు ,ఆపాలని పోడు సాగు దారులపై అటవీ అధికారులు అక్రమంగా బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ,అటవీ రక్షణ నిబంధనలు 2022 పేరుతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం పీ వై ఎల్ పాల్వంచ డివిజన్ అధ్యక్షుడు కాక వెంకటేష్, బోగ్గం రాజులు, ఎదిరాజు నాగరాజు తెల్లం నాగేష్ ,సున్నం నాగేష్ ,సున్నం రాజు ,కాకా బజారు ,కారం రాంబాబు, కురసం లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: