CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెండింగ్ ఆర్జీలను త్వరగా పూర్తి చేయాలి *ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

Share it:


మన్యం న్యూస్ , ములుగు : 


పెండింగ్ ఆర్జీలను  సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ప్రజావాణి  నిర్వహించారు. మొత్తం దరఖాస్తులు 31 రాగ

ప్రజల నుండి నేరుగా  స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలో పెండింగ్ లో ఉన్న ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.జిల్లాలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో,కస్తూరిబా

కళాశాల,మైనార్టీ మోడల్ కళాశాల లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య వివరించాలన్నారు.జిల్లాలో వెనుకబడిన తరగతుల వసతి గృహాల విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు హాస్టల్ లలో టాయిలెట్స్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు,పంపించాలన్నారు.జిల్లా బీసీ సంక్షేమ అధికారి ప్రతివారం హాస్టల్ సందర్శించాలని ఆదేశించారు.

ఏదిరా,జగన్నాధపురం,వెంకటాపురం రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ శాఖ అధికారులకు జిల్లాలో పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

జాతీయ రహదారి ధ్వంసమైన చోట్ల వెంగలాపూర్,మేడారం వై జంక్షన్ రోడ్ల ప్రతిపాదనలు రూపొందించాలని అన్నారు.

జిల్లా మేనేజర్ జిసిసి,స్వయం సహాయక సంఘాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాట్లపై దృష్టి సారించాలన్నారు.జిల్లాలో యువతను ప్రోత్సహించడానికి పరిశ్రమల శాఖ ద్వారా కొత్త యూనిట్లు మంజూరు చేసి అవగాహన సదస్సులు పౌష్టికాహారం లోపం ఉన్న చోట్ల పిల్లలకు పౌష్టికాహారం అందించే విధంగా అవగాహన సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థుల పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

ఇంటర్నెట్ సిగ్నల్ ఉన్న ఏజెన్సీ గ్రామాలలో మీ సేవ కేంద్రాలు ఏర్పాటుకు చేసే విధంగా  చర్యలు చేపట్టాలన్నారు.

జిల్లాలో ఎలక్ట్రికల్ సమస్యలు తలెత్తకుండా పోల్స్ కరెంటు సరఫరా సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులకు ఆదేశించారు.ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్, డిఆర్ఓ కే రమాదేవి,సిపిఓ ప్రకాష్,డిఈఓ జీపాని, కలెక్టరేట్ ఏవో విజయభాస్కర్, డీఎస్ఓ అరవింద్ కుమార్ రెడ్డి,డిఎం శ్రీరాములు,డిఏఓ గౌస్ హైదర్,డిడబ్ల్యూఓ ప్రేమలత,సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: