CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉపాధ్యాయ ఉద్యమ నేత నాగటి నారాయణ కు నివాళులు.. యుటిఎఫ్ మండల నాయకురాలు జి స్వర్ణ జ్యోతి..

Share it:


మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::

మండలంలోని చిన్న బండిరేవ్  గ్రామంలోని  ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఉద్యమ నేత యుటిఎఫ్ పూర్వ అధ్యక్షుడు విద్యారంగం శ్రేయస్సు, ఉపాధ్యాయుల కోసం  అలుపెరగని పోరాటం చేసిన నాగాటి నారాయణ అనారోగ్యంతో మరణించడంతో దుమ్ముగూడెం మండల యూటీఎఫ్ శాఖ ఆధ్వర్యంలో సంతాపాన్ని తెలిపి ఘన  నివాళిని అర్పించడం జరిగింది ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు ఏవి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షునిగా పనిచేసి యుటిఎఫ్ సంఘ పథకాన్ని నాటి యువతరంలో రెపరెపలాడించిన నాయకుడు కామ్రేడ్ నారాయణ గత నాలుగు నెలలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో చికిత్స పొందుతూ మరణించడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేసిన మహా నాయకుడని 13 రోజుల సమ్మెతో అప్రెంటిస్ విధానం రద్దుచేసి సిపిఎస్ పై పోరాటం పిఆర్సి సాధన కోసం అలుపెరిగిన పోరాటం చేసిన యోధుడని అలానే యూట్యూబ్ సంస్థను అగ్రగామిగా నిలబెట్టిన గొప్ప నేతని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎం రూప వినయ్ రాణి  నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: