CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవన్ని ఘనంగా నిర్వహించారు.

Share it:


మన్యం న్యూస్, అక్టోబర్ 21 ,వాజేడు.:

పౌర సమాజాన్ని ఇరవై నాలుగు గంటలు కంటికి రెప్పల కాపాడుతున్నతూ, శాంతి భద్రతల పరిరక్షణకు కొరకు నిరంతరం విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్  అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాజేడు మండల కేంద్రంలో పోలీస్ సంస్కరణ స్తూపం వద్ద ఎస్సై హరీష్, ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హరీష్ మాట్లాడుతూ పోలీసులు ఎలాంటి పరిస్థితులలో నైనా దృఢ సంకల్పంతో  విధులు నిర్వర్తించడం రక్షక భటుల కర్తవ్యం, అని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ నుండి దేశ సరిహద్దుల రక్షణ వరకు నిర్వర్తిస్తారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు 1960 అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్సై సురేష్, సి ఆర్ పి ఎఫ్, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: