CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గొప్ప వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషి వత్సవాయి శ్రీధర్ వర్మ

Share it:


మన్యం మనుగడ, మంగపేట.:

మంగపేట మండలం ఆఖినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ పుట్టినరోజు సందర్బంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు శ్రీధర్ వర్మ కు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్,మాట్లాడుతూ వత్సవాయి శ్రీధర్ వర్మ ఒక వ్యక్తి కాదు వ్యవస్థ, తాను చేసిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి.సర్పంచ్ గా అతను గ్రామానికి అందించిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతూనే ఉన్నాయి, ఆపదలో ఉన్న వ్యక్తులకు కుడి చేతితో తాను అందించిన సహాయం తన ఎడమచేతికి కూడా తెలియకుండ జాగ్రత్త పడతాడు, అటువంటి మంచి మనుషులు చాలా తక్కువ ఉంటారు వారిలో వత్సవాయి శ్రీధర్ వర్మ ఒకరు, తాను పార్టీ కోసం ప్రజల కోసం చేసిన సేవలు అమోఘం, అంతే కాదు తాను తెరాస పార్టీ వ్యక్తి అయినప్పటికి ఇతర పార్టీల వ్యక్తులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం శ్రీధర్ వర్మ మంచి వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది అని పేర్కొన్నారు.టీఎంఎం ములుగు అధ్యక్షులు రాజమల్ల సుకుమార్ శ్రీధర్ వర్మ గురించి మాట్లాడుతు  శ్రీధర్ వర్మ మంచి పరివర్తన కలిగిన మహర్షి అని తెలియజేశారు.జన్మదిన వేడుకలు  సందర్బంగా వత్సవాయి శ్రీధర్ వర్మ మాట్లాడుతూ  పార్టీ పై అభిమానంతో, నాపై అభిమానం తో  నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తున్నాను అని తెలియజేశారు. పుట్టినరోజును చేసుకోవటం నాకు ఇష్టం లేనప్పటికి మన మిత్రుల కోరిక మేరకు ఒప్పుకున్నాను, ఎంతో ఆప్యాయత తో నా జన్మదిన వేడుకలు నిర్వహించిన మిత్రులకు కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమం లో టీఎంఎం ములుగు ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ ప్రవీణ్, బోడ శ్రీనివాస్, తెరాస నాయకులు, దొడ్డ భాస్కర్,మోదుగు బాబు, మండలం లోని అన్ని గ్రామాల నుండి నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: