CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాల్మీకి జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా

Share it:


మన్యం న్యూస్, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో వాల్మీకి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అశ్వరాపేటలో జరిగిన వాల్మీకి దేవాలయం కి ముఖ్య అతిథులుగా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ వాల్మీకి జయంతి సంధర్బంగా అయన ఉత్సవాలు ఇంత ఘనంగ చేయటం నాకు చాలా సంతోషంగా ఉందనీ, మనిషి అనే వాడికి పట్టుదల కృషీ ప్రధానంగా ఉండాలని పట్టుదల ఉంటే ఎటువంటి మనిషి అయినా మహోన్నతమైన స్థానం లోకి వెళ్తారని సభాముఖంగా తెలియజేశారు. దానికి ప్రస్థానంగా వాల్మీకి జీవితమే ఒక ఆదర్శం అని సామాన్యమైన ఒక మానవుడు ఈ రోజున వాల్మిక గా పరివర్తనం చెందటం జరిగిందని మనందరం కూడా వారిని ఆదర్శంగా తీసు కోవాలి అని  పట్టుదల కృషి ఉంటే ఎటువంటి వ్యక్తి అయినా ఆదర్శ పురుషుడుగా అవుతాడని దానికి ఉదాహరణ వాల్మీకి జీవితం అనీ, రామ అనే ఒక పదం పలకడం రాని అతి సామాన్యమైన వ్యక్తి మరమరా అనుకుంటూ రాములవారి యొక్క జీవిత కావ్యాన్ని అంటే ఆదికావ్యాన్ని రచించి ఈరోజుకి సుమారుగా 7000 సంవత్సరాల అయినప్పటికీ కూడా ఆ కావ్యాన్ని ఆదికావ్యంగానే పిలవడం జరుగుతుంది అనీ, ఆదికవిగా వాల్మీకిని ఉచ్చరిస్తారని, అటువంటి మహోన్నతమైన వ్యక్తి మన వాల్మీకి అని ఆయన పూర్వ నామం రత్నాకరుడు ఆయన  కుటుంబాన్ని పోషించుకోవడానికి వేటని వృత్తిగా సాగిస్తూ జీవనం సాగిచేవాడని, దానిలో భాగంగా భార్యా పిల్లలతో పాప పుణ్యాల గురించి మాట్లాడుతూ వారితో విభేదించి నా జీవితం ఒక మహోన్నతమైన స్థానానికి వెళ్ళాలని, మానవాళికి ఉపయోగపడాలని ఓ మహోన్నతమైన కార్యక్రమాన్ని సంకల్పించుకుని ఒక దైవ సంకల్పం మొదలు పెట్టారు, రామ రామ అనీ ఉచ్చరించటం రాక మర మర అనుకుంటూ రామ జపం చేయడంతో ఆయన  జ్ఞానవంతుడై రామచరితాన్ని రామాయణంగా ఆయన రచించడం జరిగిందని, ఓ తండ్రిగా, ఒక బిడ్డగా, ఒక రాజుగా, ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక సేవకుడిగా ఎలా ఉండాలనేది సమాజానికి తెలియజేయడానికి ఈ రామాయణం ఉపయోగ పడుతుంది అని ఈ కాలంలో కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతున్న సందర్భంలో ఆ యొక్క రామాయణం ఒకసారి చదివితే ఈ కుటుంబ వ్యవస్థను ఎలా గాడిలో  పెట్టుకోవాలో ఎలా ఉద్ధరించాలో తెలియజేసే ఆదికావ్యం రచించిన వాల్మీకినీ సదా మనం స్మరించుకుంటూ ఉండాలని ఆయన బాటలోని అందరం నడవాలని ఈ సంధర్బంగా ఒకసారి అందరికీ గుర్తు చేయడం జరుగుతుందని అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు  జల్లిపల్లి శ్రీరామ మూర్తి ఆలపాటి రాము, ఎంపీటీసీ వేముల భారతి, అశ్వరావుపేట టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సంపూర్ణ, చిప్పనపల్లి బజార్ అయ్యా, ఎస్సై సాయి కిషోర్ రెడ్డి, ముబారక్ బాబా, నల్లబోతుల నాగు, శ్రీను, రమణ, నాగరాజు, ఆలయ కమిటి సభ్యులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: