CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి : ఎస్పీ డా.వినీత్.

Share it:

 


  • విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి : ఎస్పీ డా.వినీత్.
  • జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రపురం నందు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం స్మృతి పెరేడ్" కు హాజరయిన జిల్లా ఎస్పీ.

మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. పోలీసుల అమర వీరుల వారోత్సవాల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హేమచంద్రాపురం వద్ద ఉన్న జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు స్మృతి పరేడ్ నిర్వహించి,అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు .జిల్లా ఎస్పీ డా.వినీత్.ముందుగా పెరేడ్ గ్రౌండ్నకు చేరుకుని సాయుధ బలగాల వద్ద నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు.తర్వాత "పుస్తక్ టోలి" పెరేడ్ ద్వారా విధులు నిర్వర్తిస్తూ ముష్కరుల దాడిలో  ఈ సంవత్సర కాలంలో అమరులైన వీర జవాన్ల పేర్లతో కూడి ఉన్న పుస్తకాన్ని ఎస్పీ కి అందజేశారు.అనంతరం ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు ఈ ఏడాది దేశ సరిహద్దులో పహారా కాస్తూ,దేశ ప్రజల రక్షణకై విధులు నిర్వరిస్తూ దేశ వ్యాప్తంగా అశువులు బాసిన 264 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ అక్టోబర్ 21,1959 సంవత్సరంలో సిఆర్పియఫ్ బలగాలకు చెందిన ఎస్ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మంది భారత జవాన్లు కలసి లడక్ ప్రాంతంలో హాట్ స్ప్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా చైనా సైన్యం వారిపై దొంగ దాడి చేసి 10 మందిని హతమార్చినదన్నారు.అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే)ను జరుపుకుంటున్నామని అన్నారు.దేశంలోని ఒక్కొక్క రాష్టంలో ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుందని,పొరుగున వున్న మహారాష్ట్ర,ఛతీస్ ఘడ్  అస్సాం వంటి కొన్ని నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలో ఎంతో మంది జవాన్లను కోల్పోయామన్నారు.ఇతర దేశాలతో సరిహద్దు కలిగి ఉన్న  రాష్ట్రాలలో పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాదంతో ఎంతో మంది పోలీసులు,ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని అన్నారు.ఈ విధంగా ఎవరైతే దేశం కోసం విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేస్తారో,వారి ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజు  "పోలీస్ ఫ్లాగ్ డే" ను జరుపుకుంటున్నామన్నారు.ప్రజల ధన,మాన ప్రాణ రక్షణకై ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ లాంటి విధులలో అమరులైన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తేదీ "జాతీయ ఐక్యత దినోత్సవం”వరకు ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.అనంతరం పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పమాలను సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా పోలీసు అధికారులు  సిబ్బంది పోలీస్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు అధికారులకు సిబ్బందికి ఏర్పాటు చేసిన వాలీబాల్  "టగ్ ఆఫ్ వార్" క్రీడలను ఎస్పీ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు, భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్, ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్,కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు,ఇల్లందు డిఎస్పీ రమణమూర్తి, మణుగూరు డిఎస్పీ రాఘవేంద్రరావు, పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,డీసీఆర్బీ డిఎస్పీ నందీరామ్,ఎస్బి ఇన్స్పెక్టర్స్ స్వామి,రాజు మరియు జిల్లాలోని ఇతర సిఐలు,ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: