CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమ్ముడుపోని ఆత్మగౌరవం

Share it:


*బిజెపి కుట్రలను భగ్నం చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

* జయహో తెలంగాణ... జయహో రేగా

*జిల్లాలో అట్టుడికిన ఆందోళనలు

*బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు *ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కు పాలాభిషేకం

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 27): ఒకవైపు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ, మరోవైపు కుటిల రాజకీయాలు పన్నుతున్న బీజేపీ పార్టీ బండారాన్ని బట్ట బయలు చేసిన తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలకు రాష్ట్రవ్యాప్తంగా నీరాజునాలు అందుతున్నాయి. అమరవీరుల త్యాగ ఫలాలతో సాధించుకున్న తెలంగాణలో అమ్ముడుపోని ఆత్మ గౌరవం ముందు బిజెపి కుట్రలు విఫలమయ్యాయి. హైదరాబాదులో ఓ ఫామ్ హౌస్ లో జరిగిన సంఘటన బిజెపి చౌకబారు రాజకీయాలకు తెరలేపిన టు అయింది. కోట్లాది రూపాయల డబ్బులు 25 తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిన బిజెపి నీచ రాజకీయాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనించి ఎందుకు స్వయంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు  పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి బిజెపి శక్తులను అదుపులోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అనుసరించి చాకచక్యంగా వ్యవహరించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావులతో అటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు రాష్ట్రంలోనే సంచలనం రేపింది. కోట్లతో కొనుగోలు చేయాలని చూసిన బీజేపీ శక్తులను యుక్తి తోబట్టబయలు చేసి తిప్పికొట్టిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జేజేలు పలుకుతున్నారు.

భద్రాద్రి జిల్లా లో.. ప్రభుత్వ విప్ రేగా కు పాలాభిషేకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా బిజెపి అనుసరించిన నీచ రాజకీయాలను ఎండగడుతూ బిజెపి దిష్టిబొమ్మను దగ్ధం చేయడమే కాకుండా చాకచక్యంగా వ్యవహరించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పాలాభిషేకం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో మైనార్టీలు, రేగ యువసేన సంయుక్త ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద జై రేగా జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ విప్పు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు మాజీ వార్డు కౌన్సిలర్ మోడీ భాస్కర్ మైనార్టీ నాయకులు అన్వర్, రేగా యువసేన నాయకులు రవి మాట్లాడారు. దేశ్ కి నేత కెసిఆర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన బీ ఆర్ఎస్ ను చూసి దేశ ప్రధాని మోడీ కి ఇప్పటికే ముచ్చెమటలు పడుతున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే మనస్తత్వం కాదని తెలంగాణ ఉద్యమ అగ్ని శిలలో పుట్టుకొచ్చిన కొమురం భీము లని అన్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన బిజెపికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిన తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కెసిఆర్ కి వారసులని స్పష్టం చేశారు. అధికారాన్ని చేజిక్కించుకోవాలని అడ్డదారులు తొక్కే బిజెపి నియంత పాలన కు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మోరే రవి, రేగా యువసేన నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: