CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐ టి సి ఎం ఎస్ కే వారి సౌజన్యంతో నూతన తరగతి గదికి భూమి పూజ కార్యక్రమం.

Share it:


మన్యం న్యూస్, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామపంచాయతీ పరిధిలో ఎంపీపీ ఎస్ పాఠశాల నందు 9,41,733 రూపాయల వ్యయంతో నూతన తరగతి గది కొరకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీసీ మేనేజర్లు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, పంచాయతీ పాలకవర్గం సభ్యులు  మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటిసి చీప్ మేనేజర్ చెంగల్ రావు మాట్లాడుతూ ఈ తరగతి గది నిర్మాణంలో 7,53,387 రూపాయలు అనగా 80శాతం వ్యయాన్ని ఐటీసీ తరుపున మిగిలిన 1,88,346రూపాయల నిర్మాణ వ్యయం అనగా 20శాతం గ్రామ పంచాయతీ వ్యయం తో నిర్మిస్తున్నామని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల రూపకల్పనకు ఐటీసీ సహకారం ఎప్పుడూ ఉంటుందని, ప్రాథమిక విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించడం ఐటీసీ సామాజిక దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేపడుతుంది అందులో ముఖ్యమైన ప్రాథమిక విద్య అని, అందులో భాగంగా మౌలిక వసతుల నిర్మాణ కార్యక్రమాలకు ఐటిసి ఎమ్మెస్ కే ముఖ్య పాత్ర పోషించి 98 పాఠశాలలు బూర్గంపహాడు, అశ్వాపురం మండలంలో పూర్తి చేయడం జరిగింది. ఇంతటి మంచి సదుపాయాలను వినియోగించుకుంటున్న పంచాయితీ పాలకవర్గానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామపంచాయతీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఐటీసీ సేవలు మరువలేనివని, పాఠశాలలో నూతన టాయిలెట్ల నిర్మాణం చేశారు. అలాగే ఇప్పుడు పాఠశాల నూతన తరగతి గదికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని వారి పంచాయతీ సిబ్బంది తరపున, గ్రామ ప్రజల తరఫునఐటిసి ఎమ్మెస్ కే బృందానికి, వాష్ ప్రోగ్రాం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఐ టి సి చీఫ్ మేనేజర్ చంగల్ రావు, ఐటిసి ఎమ్మెస్ కే ప్రోగ్రాం మేనేజర్ జయప్రకాష్, ఐ టి సి ఎమ్మెస్ కే ప్రోగ్రాం ఆఫీసర్ కృష్ణ, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ మేడవరపు సుధీర్, ఎంపీటీసీ నరేష్,  ఎస్ఎంసి చైర్మన్  ఈశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనక లక్ష్మి, గ్రామ పెద్దలు కొల్లు మల్లారెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాటి మన్మధ రెడ్డి, రామగిరి భాస్కర్ కార్యదర్శి సైదులు, ఐ టి సి ఎం ఎస్ కె వాష్ ప్రోగ్రాం అసిస్టెంట్ ఆఫీసర్ సునీల్ బాబు, వాష్ ప్రోగ్రాం ఇంజనీర్ సుబ్బయ్య, హైజిన్ ఎడ్యుకేటర్ రాజ్ కుమార్, వాష్ ప్రోగ్రాం సిసి వెంకటేష్, వాష్ ప్రోగ్రాం సి ఓ సందీప్, ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: