CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారత రాష్ట్ర సమితి దేశంలోనే చారిత్రాత్మకం.. సువర్ణ అక్షరం

Share it:


  •  భారత రాష్ట్ర సమితి
  • దేశంలోనే చారిత్రాత్మకం.. సువర్ణ అక్షరం
  • జిల్లాలలో నయా జోష్.. నేతల్లో ఉప్పొంగిన ఉత్సాహం
  • భద్రాద్రి జిల్లా లో రేగా పవర్.. వ్యతిరేక శక్తులకు ఫీవర్
  • ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ఎమ్మెల్యే రేగా కు ప్రశంసలు
  • భద్రాద్రి జిల్లా లో టిఆర్ఎస్ అధ్యక్షుడిగా వన్ మాన్ షో

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 06... దేశ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగనున్నాయి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దేశ స్థాయిలో మరో కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో టిఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయి లో విలీనం చేస్తూ భారత రాష్ట్ర సమితి గా ప్రకటించడం, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా నేతలతో పాటు కార్యకర్తల్లో కూడా నయా జోష్ కనపడుతుంది. ఎవరు ఊహించని విధంగా మేధావుల సమాలోచన కనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితి గా శ్రీకారం చుట్టడంతో దేశంలో ఉన్న చారిత్రక ఘట్టంగా మిగిలిపో వడమే కాకుండా ఒక సువర్ణ అక్షరాన్ని లిఖించారు. ఇతర దేశాల కంటే మన దేశం తక్కువ కాదని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సరిపడా నిధులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దేశంలో అనాలోచిత నిర్ణయాల వల్ల సంక్షేమ పథకాలు దరిచేరకుండా కొన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నేపధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎవడబ్బ సొమ్ము కాదని మన దేశం.. మన పాలన.. మన నిధులు అనే నినాదాన్ని పెంపొందించి జాతీయ స్థాయిలో సరికొత్తగా శ్రీకారం చుట్టిన భారత రాష్ట్ర సమితికి ఇప్పటికే ఆయా రాష్ట్రాల ప్రజాప్రతినిధులతో పాటు స్వరాష్ట్రంలో ప్రజాప్రతినిధులు కూడా అంగీకారం తెలుపుతూ బి ఆర్ ఎస్ వెంటే మేమంతా అంటూ శబదం చేశారు. దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఉనికిని చాటుకునే మరోవైపు దేశ రాజకీయాల్లో సరికొత్త మార్పును తీసుకు వచ్చి ప్రజలకు సుస్థిరమైన పాలన అందించేందుకు ఏర్పాటు బీఆర్ఎస్ పార్టీకి దేశ ప్రజలు ఇప్పటికే జేజేలు పలుకుతున్నారు.


భద్రాద్రి జిల్లా లో ఎమ్మెల్యే రేగా పవర్.. వ్యతిరేక శక్తులకు ఫీవర్

ఆదివాసి ముద్దుబిడ్డగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత అనుచరుడుగా పేరుగడించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కు ముఖ్యమంత్రి కెసిఆర్ చేత ప్రశంసలు అందుకుంటున్నారు. అధిష్టానం ఆదేశాలు అనుసరించి సమాలోచన నిర్ణయాలతో అడుగు ముందుకు వేస్తూ ఎప్పటికప్పుడు పార్టీని ఎదురులేని శక్తిగా మలిచిన టిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే రేగా పవర్ ముందు వ్యతిరేక శక్తుల గుండెల్లో ఇప్పటికీ ఫీవర్ మొదలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నయవంచకులు, అవకాశవాదులు, వ్యతిరేక శక్తులు, కూటమిగా ఏర్పడి ప్రతిరోజు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా అప్పటికీ టిఆర్ఎస్ భద్రాద్రి జిల్లా బాస్ గా ఎమ్మెల్యే రేగా కార్యచరణ ప్రణాళికల ముందు పరిశుద్ధుల పన్నాగం విఫలం అవుతూనే ఉంది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మారుమూల గిరిజన ప్రాంత ప్రజలకు అందించడమే కాకుండా ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడుగా భద్రాద్రి జిల్లాలో వన్ మాన్ షోగా  ఇప్పటికే రేగా అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. పొడు పట్టాల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట ధైర్యంగా చెప్పగలిగిన ఎమ్మెల్యే రేగా పార్టీ అధిష్ఠానం నుంచి ఒక స్పష్టమైన హామీని ఇచ్చే విధంగా చేసిన కృషి సఫలీకృతమైంది. అంతేకాకుండా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పన చరిత్రలో మరుపురాని ఘట్టం గా మిగిలింది


రేగా నీ జోరుతో... ప్రత్యర్ధులు బేజార్ కావాలే..

భుజం తట్టి మెచ్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

భద్రాద్రి జిల్లా నీదే బాస్ నువ్వే ఇక నీ జోరుచూసి.. ప్రత్యర్థులు బెజార్ కావాలి.. దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ స్థాయిలో విలీనం చేస్తూ భారత రాష్ట్ర సమితి గా నామకరణం చేసిన సందర్భంలో సచివాలయంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేగా భుజంతట్టి మెచ్చుకోవడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు చత్తీస్గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్యే రేగాకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం మరింత బాధ్యతను పెంచిందని జాతీయ స్థాయిలో భారత రాష్ట్ర సమితిని ఎదురులేని శక్తిగా మలిచేందుకు సైనికుడిగా పని చేస్తానని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్పష్టం చేయడం కార్యకర్తలకు అభిమానులకు తెలంగాణ ప్రజలకు ఉప్పొంగిన ఉత్సాహాన్ని నింపారని మేధావివర్గం విశ్వసిస్తోంది.

Share it:

TELANGANA

Post A Comment: