CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉపాధి హామీ మాస్టర్ గోల్ మాల్

Share it:


మన్యం న్యూస్:ములకలపల్లి (అక్టోంబర్ 14):

మండల లం లోని జగన్నాధపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న నర్సాపురం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ సామాజిక తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు గ్రామస్తులు  ఆరోపిస్తున్నారు. నరసాపురం గ్రామం లో మేట్లు గా పనిచేస్తున్న కొందరు వారి కుటుంబ సభ్యులందరి పేర్ల పై జాబ్ కార్డులు సృష్టించి క్షేత్రస్థాయిలో పని చేయకపోయినా మస్టర్లు వేశారని, జీడిమామిడి టేకు మొక్కలు మంజూరు చేయించి డబ్బులు డ్రా చేసినట్లు తనిఖీ బృందానికి గ్రామస్తులు వివరించారు.ల్యాండ్ లెవెలింగ్ సంబంధించిన నేమ్ బోర్డులు పని జరగని ప్రదేశాల్లో పెట్టి డబ్బులు డ్రా చేశారని, ఆడిట్ బృందం గ్రామంలో సర్వే చేస్తున్నారని విషయం తెలుసుకున్న మేట్లు ఆ బోర్డులు తీసేశారు. హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తున్న అనేకమంది వారి పేర్ల పై మొక్కల మంజూరు చేసి,మస్టర్లు (హాజరు )వేసి డబ్బులు డ్రా చేశారు. గ్రామంలో రైతులు ధాన్యం  ఆర పెట్టుకోవడానికి రైతులకు మంజూరైన రైతు కల్లాలు కూడా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని అవి మంజూరు కావాలంటే ఐదు వేల రూపాయలు ఇస్తేనే లేకుంటే కళ్లాలు మంజూరు కావని స్వయానా టెక్నికల్ అసిస్టెంట్ స్వరూపారాణి ఆ గ్రామ రైతు గుంటూరు మారే శ్వరరావు ను డిమాండ్ చేసే డబ్బులు వసూలు  చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రైతు కూలీలకు ప్రవేశపెట్టిన ఈ పథకం బినామీలకు ఉపాధిగా మారిందని గ్రామంలో అనేక మంది గిరిజన సన్న,చిన్న కారు రైతు కూలీలకు పండ్ల మొక్కల మంజూరు చేసి పనులు కల్పించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.గ్రామంలో జరిగిన అనేక అక్రమాలు టెక్నికల్ అసిస్టెం,స్వరూపరాణి ఇద్దరు మేట్లు ఆధ్వర్యంలోని ఈ అక్రమాలు జరిగాయని,జరిగిన అనేక అక్రమాలపై గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ సొమ్మును రికవరీ చేసి నిజమైన గిరిజన సన్న,చిన్నకారు రైతు కూలీలకు పండ్ల మొక్కల మంజూరు చేసే పనులు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: