CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జోరుగా అక్రమ వడ్డీ వ్యాపారం తుంగలో తొక్కుబడ్డ నిబంధనలు

Share it:


  •  జోరుగా అక్రమ వడ్డీ వ్యాపారం
  • తుంగలో తొక్కుబడ్డ నిబంధనలు
  • రోడ్డున పడుతున్న కుటుంబాలు..
  • అనుమతులు లేకుండానే వడ్డీ వ్యాపారం


మన్యం న్యూస్, అశ్వారావుపేట: రాను రాను వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గోరంత అప్పు ఇచ్చి కొండంత వడ్డీ వసూలు చేస్తున్నారు.

ఎదుటి వారి అవసరం, కష్టాలు ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారులు పడగ విప్పుతున్నారు. అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామంలో  ఫైనాన్స్‌, మైక్రో ఫైనాన్స్‌ వల్ల గతంలో ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. గత కొన్ని రోజుల కాలంలో వినాయకపురం గ్రామానికి  చెందిన మక్కెళ్ల నాగరాజు (30) నిండు ప్రాణం తీసుకున్న ఘటన మనం చూసాం. అయినా వీరి వడ్డీ మాత్రం మారదంటున్నారు. ఇలాంటి సంఘటనలు సమసిపోకముందే పల్లెలు, పట్టణాల్లో వడ్డీ వ్యాపారం మితిమీరిపోతోంది. అధిక వడ్డీ వసూలు చేస్తూ బాధితులకు నరకయాతన చూపిస్తున్నారు. కనీసం రూ. 3 నుంచి రూ. 20 వరకు వడ్డీకి అప్పులు ఇస్తున్నారు. అధిక వడ్డీలు కట్టలేక అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వినాయకపురంలో ప్రతియేట రూ. లక్షలలొ వడ్డీ వ్యాపారం జరుగుతోందని బాహాటంగా విమర్షలున్నాయి. సులభ వాయిదా పద్ధతిలో చెల్లించవచ్చు అంటూ ఆశ చూపుతూ అక్రమంగా వ్యాపారం కొనసాగిస్తున్న కొందరి గేటు గాళ్ళ కథనం వార్తాపత్రికలలో ప్రచారం అవడం గమనార్హం. వినాయకపురం ఆటో తోలుకునే వ్యక్తి మరియు జామాయిల్  వ్యాపారాలు చేసే వ్యక్తులుగా సమాచారం. ఇందులో గిరిగిరి దందా నడిపే వారే అధికంగా ఉంటారు. వీరిని ఎక్కువగా చిరువ్యాపారులు ఆశ్రయిస్తారట. రూ.10 వేలు అప్పుగా కావాలనుకున్న వారికి రూ.వెయ్యి కోత విధించి రూ.9 వేలు ఇస్తారట. వీరి నుంచి రోజుకు రూ.500 చొప్పున 20 రోజుల్లో రూ.10 వేలు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. మరికొంతమంది వంద రూపాయలకు రూ.5నుంచి రూ.15 చొప్పున వడ్డీ వసూళ్లకు పాల్పడుతున్నారట. వారానికి కొంత చెల్లిస్తే సరిపోతుంది,, అంటూ మూడు నెలల కాలపరిమితిని విధిస్తారట. కానీ, చివరికి మొత్తం చెల్లించేటప్పటికి తీసుకున్న దానికంటే త్రిబుల్ చెల్లించవలసిన పరిస్థితి ఎదురవుతుందని కొందరు చెప్పుకుంటున్నారు. ఎందుకు ఇంత వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇది వడ్డీ వ్యాపారం, ఇలానే ఉంటుంది. మీరు ఒకవేళ చెల్లించలేకపోతే మీరు ఇచ్చిన ప్రాంశరీ నోటు, మీరు సంతకం చేసిన ఖాళీ చెక్ మా వద్ద ఉన్నాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.


దర్జాగా వడ్డీ దందా..


ఈ దందా నిర్వహిస్తున్న పలు నడిబొడ్డు అక్రమ వడ్డీ వ్యాపారులు దర్జాగా కొనసాగుతుండడం విశేషం. అత్యధికులు అనుమతి లేకుండానే ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. అలా అయితే మనీ లెండింగ్‌ చట్టానికి తూట్లు పొడిచినట్లే. చట్టాన్ని గుర్తించే అధికారులకు నజరానాలు అందుతుండడంతో బహిరంగంగానే తమ వ్యాఖ్య సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినాయకపురం గ్రామంలొ ఎక్కడా లేని ఈ అక్రమ వ్యాపారం లక్షలలొ సాగుతోందట. బాధితుల్లో అత్యధిక రైతులు, చిరు వ్యాపారులే ఉంటున్నారు. 


నిబంధనలు ఏం చెబుతున్నాయి..


వడ్డీ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక నిబంధనలు విధించింది. వడ్డీ తీసుకునే ప్రజలపై భారం పడకుండా, ఇబ్బందులు కలగకుండా చట్టాలను రూపొందించింది. దీని కోసం మనీ లెండింగ్‌ యాక్టును అమలులోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి తీసుకుంటేనే వడ్డీ వ్యాపారం చేయొచ్చు. దీని కోసం తహసీల్దార్ కార్యాల ఫారాలు పూరించి నియామకంలో చేయించుకోవాలి. వడ్డీ ఏడాదికి నిర్ణీత శాతంలోపు మాత్రమే తీసుకోవాలి. ఎన్ని నెలలు వడ్డీ ఇస్తారో దాని విభజించుకోవాలి. ఏటా లెక్కలు అధికారులు పరిశీలించాలి. దీనికి తోడు ఈ వ్యాపారానికి ఆదాయ పన్ను చెల్లించాలి. కానీ ఇక్కడ వ్యాపారులు ఈ అనుమతులు తీసుకోవడం లేదు. 


కుదవలో ఖాళీ చెక్కులు, ప్రామిశరీ నోట్లు, ఏటీఎం కార్డులు


వినాయకపురంలొ వడ్డీ వ్యాపారుల్లో ఖాళీ చెక్కులు, ప్రామిశరీ నోట్లు, ఏటీఎం కార్డులు, బంగారు ఆభరణాలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వాహనాలు కుదవ పెట్టుకొని ఇచ్చే దళారులే అత్యధికంగా ఉ న్నారట. తమ వద్దకు వచ్చే చిరు వ్యాపారులు, రైతులకు ఎలాంటి అను మతులు తీసుకోకుండానే వడ్డీకి డబ్బులు ఇస్తున్నారట. ఈ వ్యాపారులు 25 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేస్తూ చిరువ్యాపారుల, రైతుల రక్తం పిండుతున్నారనే విమర్శలున్నాయి. వినాయకపురం గ్రామంలొ కొంతమంది దళారులు ఎలాంటి అనుమతులు లేకుండా చిరువ్యాపారులకు, రైతులకు అప్పు ఇస్తూ ముక్కుపిండి వసూలు చేస్తున్నారట. 


వడ్డీ వ్యాపారం.. పేదోడిపై భారం..కట్టకపోతే బెదిరింపులు...వేధింపులు...


అప్పు తీసుకున్న వారు సకాలంలో చెల్లింపులు చేయకపోతే బెదిరింపులకు, వేధింపులకు గురవుతున్నారట. వ్యాపారం చేసుకునే చోట అవమానించడం జరుగుతుందని, డబ్బులు చెల్లించే వరకు బజారుకీడుస్తూ, పరువుకు భంగం వాటిల్లేలా ప్రవర్తించడం వంటివి చేస్తున్నారనే ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వారి ఆగడాలు తాళలేక ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేకపోతున్నారు. దీంతో ఈ వడ్డీ వ్యాపారులు కూలీలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే తమ పరువు పోతుందన్న ఉద్దేశంతో ఎంత వడ్డీ అయినా చెల్లించక తప్పడం లేదంటూ వారు ఆవేదన చెందుతున్నారు. మండల కేంద్రంలో రోజుకో ఊరు చొప్పున వారానికి ఏడు రోజులు వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోంది. మండల కేంద్రంలో జరుగుతున్న ఈ దందా గురించి అధికారులకు తెలిసినప్పటికీ పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వ్యాపారుల నుండి కాపాడాలని కోరుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: