CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణరైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి : ములుగు జిల్లా కార్యదర్శి ఎండి గఫూర్.

Share it:


మన్యం న్యూస్,  ఏటూరు నాగారం :

 ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి  గ్రామంలో తెలంగాణ రైతు సంఘం మండల మహాసభ  ఎండి యాకూబ్ అధ్యక్షతన జరిగిన ఈ  మహాసభకు ముఖ్య అతిథిగా సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గఫూర్ హాజరై మాట్లాడుతూ.పోడు భూముల సర్వే  రైతులందరికీ హక్కు పత్రాలు వచ్చే విధంగా సర్వే నిర్వహించాలని మండలంలో అనేకమంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఏవి అందడం లేదని సాగు చేసుకుంటున్న ప్రతి రైతుకు పట్టాదారుపా పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మండలంలో అనేకమంది రైతులు పాడి గేదెలపై ఆధారపడి జీవిస్తున్నారని ప్రభుత్వ పాల కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేట్ వ్యాపారస్తులు అతి తక్కువ ధరతో పాలు కొనుగోలు చేస్తున్నారని అందువలన పాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెంటనే మండలంలో  ప్రభుత్వ పాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పాల రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నవంబర్ 3న  ములుగు జిల్లా కేంద్రంలో డి ఎల్ ఆర్ గార్డెన్ లో తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా ప్రధమ మహాసభలు  జరుగుతున్నాయని ఈ యొక్క మహాసభలకు  ములుగు జిల్లా రైతు సంఘం నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా రైతాంగాన్ని కోరారు.ఈ మహాసభలు జిల్లా రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఎజెండా రూపంలో తీసుకొని మహాసభలో చర్చించి రాబోవు రోజులలో వాటి పరిష్కారం కోసం తెలంగాణ రైతు సంఘం రైతుల పక్షాన నిలబడి పని చేయడం కోసం ఈ మహాసభలు వేదికగా ఉపయోగపడతాయని జిల్లాలో అనేక భూ సమస్యతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అది పోడు భూముల సమస్య కావచ్చు రెవెన్యూ భూముల సమస్య కావచ్చు ఇంకా అనేకమందికి పట్టాదారు పాసుపుస్తకాలు రాక నిత్యం తాసిల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారని ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి భూ సమస్యను మొత్తంగా కూడా పరిష్కారం చేయాలని సాగు చేసుకుంటున్న ప్రతి రైతు కు  పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి ఇవ్వాలని సాగు చేసుకుంటున్నా ప్రతి రైతుకు రైతుబంధు కిసాన్ సమ్మన్  నిధులు ఇవ్వాలని

 వరి ధాన్యం కొనుగోలు సమస్య తీవ్రంగా ఉందని పండిన పంటను రైతులు అమ్ముకోవాలంటే ఎన్ని కిలోల తరుగు తీస్తారో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి తరుగు తీయకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని గోదావరి జలాలు ములుగు జిల్లా వ్యాప్తంగా సాగునీరు అందించాలని జిల్లాలో ఉన్నటువంటి రామప్ప లక్నవరం సరస్సులతో పాటు చిన్న మధ్యతరహా ప్రాజెక్టుల మరమ్మతులు చేయాలని పంట కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని జిల్లాలో కల్తీ  విత్తనాలు ఎరువులు పురుగుమందుల అమ్మకాలపై అధికారులు దృష్టి సారించి నివారించాలని వ్యవసాయ అనుబంధ రంగాలైన కూరగాయలు పాడి,చేపలు కోళ్ల పెంపకాల పైన రైతులకు సరైన అవగాహన కల్పించి ఉపాధి అవకాశాలను కల్పించే విధమైనటువంటి చర్యలు చేపట్టాలని

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్మించినటువంటి రైతు వేదికలు చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయని అగ్రికల్చర్ & ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్లు రైతు వేదికలలో రైతులతో  సమావేశాలు పెట్టి తగు సూచనలు సలహాలు ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారులు రైతువేదికలకే పరిమితమవుతున్నారని వ్యవసాయ అధికారులు కింది స్థాయిలోకి వెళ్లి పంటల నమోదు చేసుకోవడం లేదని రైతులతో ఫోన్ల మాట్లాడి వారు  చెప్పింది రాసుకుంటున్నారని ఇలా అయితే వాస్తవ సాగులెక్క ఎలా వస్తుందని అన్నారు.అనంతరం తెలంగాణ రైతు సంఘం మండల కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా వాడకాపురం సారయ్య, ప్రధానకార్యదర్శిగా ఎండి యాకూబ్, కమిటీ సభ్యులుగా ఎస్కే అల్లావుద్దీన్, ఏ శ్రీను, ఎం ఎల్లన్న, పాయల్ నరసయ్య, కనుకుల వెంకన్న, సోయం బద్రి, పూణెం రమేష్, ముప్ప గోవిందరెడ్డి, సింగిరెడ్డి జయపాల్ రెడ్డి, బండారి నరసింహులు, కొడాలి సత్యనారాయణ, బండారి రమేష్, గద్ద రాజు, లను మహాసభ ఎన్నుకోవడం జరిగింది. ఈ మహాసభలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సామ చంద్రారెడ్డి 40 మంది రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: