CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దొంగల ముఠా అరెస్ట్

Share it:


*ఏజెన్సీలో కలకలం రేపిన దొంగతనలు.

 *చోరీలను ఛేదించిన పోలీసులు.

*బయందోళన వద్దని ప్రజలకు సూచన.

*నేరాల నియంత్రణకు షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

మన్యం న్యూస్, ఏటూరు నాగారం :

ఏజెన్సీ ప్రాంతంలోని కొంతమంది యువత జలసాలకు అలవాటు పడి అడ్డదారులలో ప్రయాణిస్తున్నారు. ములుగు ఏజెన్సీ ప్రాంతంలోని ఏటూరు నాగారం సబ్ డివిజన్లో వరుస దొంగతనాలు జరగడం చోటు చేసుకున్నాయి. దీనిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగపేట పోలీసులు ఉదయం కమలాపూర్ శివారులోని హనుమాన్ దేవాలయం వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ లో శనివారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఏఎస్పీ అశోక్ కుమార్ వివరాలు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను విచారించగా వారి వద్ద ఒక నల్లటి సంచి ఉండి అందులో వెండి బంగారు వస్తువులు ఉన్నవి. ఏడు కిలోల వెండి. బంగారు వస్తువులు నాలుగు తులాలు. నిమ్మల వినయ్ కుమార్. ఇద్దరు మైనర్ బాలురు.లతో కలసి మొత్తం మూడు కేసుల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ కేసు లోని ఫిర్యాదుదారుడు లక్ష్మీ జువెలరీ యజమాని సందీప్  ముగ్గురు దొంగతనాలు చేసిన కేసులోని సొమ్మును కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సందీప్ షాపును పరిశీలించి మళ్లీ సందీప్ షాప్ లోనే దొంగతనం చేశారు. చోరీలకు పాల్పడిన ఇద్దరు మైనర్ బాలురను వరంగల్  కోర్టుకు వినయ్ కుమార్ ను  ములుగు కోర్టుకు తరలించారు. ఏటూరు నాగారం సబ్ డివిజన్లోని ప్రజలు. పండుగ సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పక్క వాళ్లకు అప్రమత్తం చేయాలని.అన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల వల్ల నేరాలు దొంగతనాలను అరికట్టవచ్చు అన్నారు. వినయ్ కుమార్ అనే వ్యక్తి ఇప్పటివరకు ఎనిమిది కేసుల్లో నేరస్థుడు అయినందున తదుపరి ఇతను పై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మండల రాజు,మంగపేట ఎస్సైలు తాహర్ బాబా,రవికుమార్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: