CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్నేహితున్ని హత్య చేసిన ముద్దాయి అరెస్టు

Share it:


  • స్నేహితున్ని హత్య చేసిన ముద్దాయి అరెస్టు
  • జగడం సాయి కుమార్ పై రౌడీ షీట్
  • పీడీ యాక్ట్ నమోదుకు ఆదేశాలు
  • విలేకరుల సమావేశంలో కొత్తగూడెం డిఎస్పి వెంకటేశ్వరబాబు

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29... మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య సిగరెట్ వ్యవహారంలో జరిగిన ఘర్షణలో స్నేహితున్ని సిమెంటు ఇటుకతో తలపై విచక్షణ రహితంగా కొట్టి చంపిన ఘటనలో ముద్దాయిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడమే కాకుండా అతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ నమోదుకు సంబంధిత పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన గణేష్ టెంపుల్ ఏరియా ఆర్కే సూపర్ మార్కెట్ వద్ద పాత కొత్తగూడానికి చెందిన కారు డ్రైవర్ జగడం సాయికుమార్, అతని స్నేహితుడు బడికెల సందీప్ కుమార్ లు అతిగా మద్యం సేవించి వారి సమీపంలో ఉన్న రాకేష్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పాన్ షాప్ దగ్గరికి వచ్చి సందీప్ కుమార్ సిగరెట్ ప్యాకెట్ కొని డబ్బులు ఇవ్వకుండా అతనితో గొడవకు దిగాడు. దీంతో పక్కనే ఉన్న అతను స్నేహితుడు జగడం సాయికుమార్ జోక్యం చేసుకొని పాన్ షాపు అతనితో ఎందుకు గొడవ పడుతున్నావు డబ్బులు ఇవ్వమని చెప్పడంతో ఆ ఇద్దరి స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగి అందరూ చూస్తుండగానే కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో జగడం సాయి కుమార్ పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో సందీప్ కుమార్ తలపై బలంగా మోదడంతో తీవ్రంగా రక్తస్రావం అయింది. దాన్ని చూసిన సాయికుమార్ అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్న సందీప్ కుమార్ ను స్థానికులు కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సందీప్ కుమార్ మృతి చెందాడు. ఈ ఘటనలో ముద్దాయిగా ఉన్న సాయికుమార్ శనివారం రోజు పాత కొత్తగూడెం లో ఉన్న అతని ఇంటి వద్దనే ఉన్నాడని ఖచ్చితమైన సమాచారం మేరకు పట్టుకునేందుకు వెళ్లగా త్రీ టౌన్ పోలీసులు అతని వెంబడించి పట్టుకొని విచారించారు. ముద్దాయి సాయికుమార్ తప్పును అంగీకరించడంతో అతనిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశామన్నారు అంతేకాకుండా నేరం జరిగినప్పుడు మృతుడి రక్తం మరకలు సాయికుమార్ దుస్తులపై పడడంతో వాటిని అతని ఇంటి వద్దనున్న వెనక భాగంలో ఉన్న చెట్ల మధ్యలో దాచి ఉంచానని చెప్పడంతో వాటిని స్వాధీన పరుచుకుని సీజ్ చేసి అతని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా గతంలో ముద్దాయి సాయికుమార్ పై 2018 సంవత్సరంలో పలు కొట్లాట కేసులో ప్రమేయం ఉన్నదని అతనిపై కొత్తగూడెం మూడవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, ఖమ్మం వన్ టౌన్ లో గంజాయి కేసులతో పాటు మొత్తం పది కేసులలో అతని ప్రమేయం ఉన్నదని దీంతో అతనిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తున్నామన్నారు. సినిమా మోజుతో పల్లం సాయికుమార్ అనే వ్యక్తి జగడం సాయికుమార్ గా పేరు మార్చుకొని విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతూ ప్రతి ఒక్కరిపై గొడవలకు దిగుతాడని డీఎస్పీ వెల్లడించారు. నేర ప్రవృత్తి కలిగిన సాయికుమార్ సినిమాల మోజుతో తాను హీరో కావాలని మరణాయుధాలు పట్టుకొని కొందరు స్నేహితులతో కలిసి ఫేస్బుక్లో ఇంస్టాగ్రామ్ లో ఫోటోలను పెట్టుకున్నాడని తెలిపారు. అతనితోపాటు  ఫోటోలకు పోజులిచ్చిన అతని స్నేహితులపై కూడా విచారణకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ నెరవేస్తూనే మన వైపు నేర నియంత్రణ కోసం పెట్రోలింగ్ విధుల్లో స్పెషల్ డ్రైవ్ ను చేపట్టనున్నట్లు తెలిపారు. రానున్న పదిహేను రోజుల్లో కొత్తగూడెం డివిజన్ వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ కూడా చేపడుతున్నట్టు తెలిపారు. జరుగుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని కొత్తగూడెం ప్రాంతంలో వ్యాపార సముదాయాలు  రాత్రి 10:30 గంటలకు మూసివేసేందుకు సంబంధిత వ్యాపారస్తులను కోరామన్నారు. రాత్రి వేళలో యువత విచ్చలవిడిగా తిరుగుతున్నారని వారిపై ప్రత్యేక నిఘాన్ని ఏర్పాటు చేసి శాఖ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో త్రీటౌన్ సీఐ అబ్బయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: