CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చలో విజయవాడ.. సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Share it:

 


  • చలో విజయవాడ..
  • సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
  • దేశ సమగ్రతను సంపదను పరిరక్షించుకుందాం
  • విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాష

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 13... జాతీయ ఉద్యమ కాలం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాలకు ప్రజా పోరాటాల పురిటిగడ్డగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్ర రాజకీయ రాజధానిగా పేరుగాంచిన విజయవాడ నగరంలో ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే సిపిఐ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా పిలుపునిచ్చారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శేషగిరి భవన్ లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రజా కార్మిక వ్యతిరేక మితవాద ,ఫాస్టెస్ట్ ,మతోన్మాద శక్తులు పెరుగుతున్నాయని ముఖ్యంగా భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజాకంటక విధానాలు అమలవుతున్నాయి అన్నారు. ఒకవైపు ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ మరోవైపు మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ సరళీకరణ ప్రైవేటీకరణ ప్రజలపై  మోపుతున్నారని విమర్శించారు. నేడు దేశంలో బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలతో దేశ సమగ్రత విచ్ఛిన్నమవుతున్న అని ఆ దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశ సంపదను పరిరక్షించుకోవడం కాకుండా వ్యతిరేక శక్తులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో అధిక ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరిచి టమే కాకుండా కార్పొరేట్ శక్తులకు దాసోహం అవుతుందన్నారు. రైతు చట్టాలను గురించి రైతులను అనేక ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతుల పాలిట శాపంగా బిజెపి ప్రభుత్వం మారిందన్నారు.  ఆప్రజాస్వామ్యంన్ని అనుసరిస్తున్న బీజేపీ పాలనకు చరమగీతం పాడేందుకు విజయవాడలో జరిగే 24వ జాతీయ సిపిఐ మహాసభలను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా సుమారు 10 నుంచి 15 వేల మంది ప్రజలను కార్యకర్తలను అభిమానులను ప్రజా ప్రతినిధులు తరలిస్తున్నామన్నరు. ఈ కార్యక్రమంలో నాయకులు వై శ్రీనివాస్ రెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్, సలిగంటి శ్రీనివాస్, దుర్గా రాశి వెంకన్న, బందెల నరసయ్య గుత్తుల సత్యనారాయణ, నరాటి ప్రసాద్ ,వాసిరెడ్డి మురళి ,కందుల భాస్కర్ ,కంచర్ల జమలయ్య ,మాచర్ల శ్రీనివాస్ ,సత్యనారాయణ చారి పిడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: