CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రూప్_1 పరీక్షలకు సర్వం సిద్ధం

Share it:

 


  • గ్రూప్_1 పరీక్షలకు సర్వం సిద్ధం
  • అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాల కు హాజరు కావాలి
  • నిమిషం ఆలస్యమైనా అనుమతించబడదు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పకడ్బందీగా ఏర్పాట్లు
  • విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 12... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 10వ తేదీన నిర్వహించబడే గ్రూప్-1 పరీక్షలకు జిల్లావ్యాప్తంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేపట్టామని సకాలంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించబడదని జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పష్టం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 16వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరిగే గ్రూప్-1 పరీక్షల కోసం జిల్లాలో 23 పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి మొత్తం 327 రూములను సిద్ధం చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 8851 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 5600 మంది అభ్యర్థులు హాల్ టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా పొందారని అన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకు ముందుగా హాజరయ్యేందుకు అనుమతి ఇస్తున్నామని ఆ తర్వాత 10.15 నిమిషాల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడదు అని స్పష్టం చేశారు. గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే అంగవైకల్యం కలిగిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మొదటి భవనంలోనే పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నామన్నారు. అభ్యర్థులకు అందించే ఓఎంఆర్ షీట్ ను నిబంధనలను అనుసరించి పూర్తి చేయాల్సి ఉంటుందని ఎట్టిపరిస్థితుల్లో రబ్బరు గాని వైట్నర్ తో గాని వినియోగిస్తే ఓఎంఆర్ షీట్ పనికి రాదు అన్నారు. హాజరయ్యే అభ్యర్థులు హాల్టికెట్లు తో పాటు ఏదైనా ప్రభుత్వం  జారీ చేయబడిన గుర్తింపు కార్డును వెంట తీసుకు రావాలన్నారు. పరీక్ష హాలులో సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ప్రత్యేక నిశిత పరిశీలన కూడా   చేస్తున్నామన్నారు. హాల్ టికెట్ పొందిన అభ్యర్థులు హాల్ టికెట్ పై వారి  పాస్ పోర్ట్ ఫొటోస్ సరిగా లేనట్లైతే తిరిగి అభ్యర్థులు వేరే పాస్పోర్ట్ ఫొటోస్ వెంట తీసుకొని గెజిటెడ్ అధికారుల చేత సంతకం చేయించుకుని పరీక్ష తరగతులకు హాజరు కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే గ్రూపును పరీక్షలకోసం పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు తోపాటు కలెక్టరేట్ కార్యాలయంలో08742-41920 నెంబరు గల హెల్ప్ డెస్క్  ఏర్పాటు చేశామన్నారు. వాడపల్లి గా నిర్వహించే గ్రూప్-1 పరీక్షల కోసం అధికారులతో పాటు పోలీసులు, సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: