CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలి : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

Share it:

 


  • గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలి : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్
  • జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల అభ్యర్థులకు ప్రత్యేకంగా బస్సుల ఏర్పాటు
  • పోలీస్ అధికారులతో సమావేశంలో జిల్లా ఎస్పీ

మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 13 ... ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పగడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 16వ తేదీన జరగబోయే గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ నియమావళి ప్రకారం పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయాలని తెలిపారు.పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేసి ప్రజలు  గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని కోరారు.పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఉండే జిరాక్స్ షాపులు,పాన్ షాపులు లాంటి ఇతరత్రా వాటిని ముందుగానే మూసి ఉంచేలా దుకాణదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాలలోకి అభ్యర్థులు కేటాయించబడిన అధికారులు,సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించకూడదని తెలియజేసారు.పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి సౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటించాలని కోరారు.జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలైన చర్ల,దుమ్ముగూడెం,గుండాల,ఇల్లందు మండలాల నుండి పరీక్షకు హాజరయ్యా అభ్యర్థుల కోసం ఆర్టీసీ యాజమాన్యం సహకారంతో ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు.హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను గాని,అనుమతిలేని ఇతర వస్తువులను గానీ పరీక్షా కేంద్రంలోనికి తీసుకురాకుండా అవగాహన కల్పించాలని కోరారు.గ్రూప్-1 క్రిమినరీ పరీక్ష సజావుగా సాగేందుకు సమన్వయకర్తగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు  వ్యవహరిస్తారని తెలియజేసారు.

ఈ సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పి డి.శ్రీనివాసరావు,కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వరబాబు,ఇల్లందు డీఎస్పీ రమణమూర్తి,పాల్వంచ డిఎస్పీ సత్యనారాయణ, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ ,సిఐలు,ఎస్సైలు పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: