CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

140 జి.ఓ తో హక్కు పత్రాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం మానుకోవాలి యాప్ ల పేరుతో ఆపాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము -వాసం నాగరాజు

Share it:


మన్యం న్యూస్ , అక్టోబర్ 12 , వెంకటాపురం.;:


తెలంగాణ ప్రభుత్వం యాప్ ల పేరుతో కాలయాపన చేస్తూ, పోడు హక్కులను కాల రాయాలని యోచిస్తోంది అని ఏ.ఎన్.ఎస్.రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు ఆరోపించారు. బుధవారం ఒంటి మామిడి  పోడు సర్వే  లో పాల్గొన్న  మండల ప్రత్యేక అధికారి అరవింద్ ,ఎంపిడిఓ బాబు ల తో వాసం నాగరాజు పోడు భూముల సమస్యల పైన మాట్లాడటం జరిగింది.అర్హులందరికి హక్కు పత్రాలు వచ్చేలా చూడాలని అధికారుల ను కోరడం జరిగింది. అనంతరం ఆయన పోడు రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది.  ప్రభుత్వం ఎనిమిది ఏళ్ళుగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని ఇన్ని రోజులు ఊరిస్తూ వచ్చిందన్నారు.ప్రభుత్వం కుట్ర పూరితంగా 140  జి.ఓ తెచ్చి అటవీ హక్కుల చట్ట ఉద్దేశానికి తిలోదకాలు దిద్దుతూ, ఆదివాసీల హక్కులను కాల రాసే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. రెవెన్యూ భూమి కలిగిన ఆదివాసీలకు పోడు భూములు ఇవ్వొద్దు అనడం శోచనీయం అన్నారు.  రెవెన్యూ భూమి ఉన్న వారికి పోడు హక్కు రాదని చట్టంలో ఎక్కడ లేదని అన్నారు. 10 ఎకరాలు వరకు హక్కు కల్పించాలని చట్టంలో ఉందన్నారు. గతంలో సర్వే చేసి రశీదులు సాగుదారులకు ఇచ్చారు అన్నారు. కానీ ఇప్పుడు సర్వే చేసి రశీదులు ఇవ్వడం లేదన్నారు. సరిహద్దులు కూడా రాయడం లేదన్నారు. ఒక రైతు రెండు, మూడు చోట్ల పది ఎకరాల లోపు ఉంటే యాప్ లో ఒకే చోట మాత్రమే నమోదు అవుతోందని అన్నారు.దీని వల్ల ఆదివాసీలు మిగతా భూమి కోల్పోతున్నారని అన్నారు. ఛాయా చిత్రాలను మాత్రమే  ప్రామాణికంగా తీసుకోవడం కారణంగా సాగుదారు నష్టపోతున్నాడని తెలియజేశారు. చట్టంలో పేర్కొన్న విధంగా గ్రామ పెద్దల వాగ్మూలం,ఎఫ్ ఆర్ సి కమిటీ, పెసా గ్రామసభల తీర్మానాలను కూడా ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. చట్టంలో సెక్షన్ 10(12) చెప్పిన విధంగా సాంకేతిక కారణాలను బూసిగా చూపి ఆదివాసీల హక్కును అడ్డుకోవడం నేరం అన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సర్వే యాప్ లన్నీ అటవీశాఖకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. 2008 సర్వే జరిగి ,ఫారెస్ట్ అధికారులు సాగులోకి వెళ్లకుండా చేసిన భూములను ఇప్పుడు సాగులో లేరని సర్వే చేయకుండా ఆపడం సరికాదన్నారు. రకరకాల కారణాలతో అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘించి హక్కు పత్రాలు రాకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నే మోకాళ్ళు అడ్డుతోంది అని విమర్శించారు. 2008 లో సర్వే చేసిన భూములకి, సాగులో ఉన్న వారందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈసారైనా హక్కు పత్రాలు ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో 12 ఎస్టి నియోజక వర్గాల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమామిడి, మహితాపురం పోడు రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: