CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లా కేంద్రంలో 23 పరీక్ష కేంద్రాలు మొత్తం అభ్యర్థులు 8851, హాజరైన వారు 6611 హాజరు కాని వారు 2240, పరీక్ష శాతం 74.69

Share it:

 


  • ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
  • జిల్లా కేంద్రంలో 23 పరీక్ష కేంద్రాలు
  • మొత్తం అభ్యర్థులు 8851, హాజరైన వారు 6611
  • హాజరు కాని వారు 2240, పరీక్ష శాతం 74.69

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 16... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ పర్యవేక్షించారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 88 51 మంది మొత్తం అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 6611 మంది అభ్యర్థులు పరీక్షలు సద్వినియోగం చేసుకున్నారు. 22 40 మంది అభ్యర్థులు గ్రైహాజరు అయినట్లు వారు తెలిపారు. పరీక్షల నిర్వహణ శాతం 74.69. లక్ష్మీదేవిపల్లి లోని శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల, పాల్వంచ లోని డి ఏవి పాఠశాలలో పరీక్షల నిర్వహణ వారు పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. రిసెప్షన్ కౌంటర్ వద్ద కోడింగ్ బాక్సులను వారు పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండ ముందస్తుగానే రూట్ మ్యాప్, బస్సు సౌకర్యాన్ని, కల్పించేవి గాకుండా అభ్యర్థులకు అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమైన ఈ పరీక్షకు దూరప్రాంతాల నుంచి సకాలంలోనే అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును నిర్వహించారు. గ్రూప్ వన్ పరీక్షలు విజయవంతంగా ముగియడంతో సహకరించిన సిబ్బంది ,అధికారులను, పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: