CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రకృతిని ఆరాధించే ఆదివాసి పండుగ, పెద్దల(కొత్తల) పండుగ. t

Share it:

        


మన్యం మనుగడ సెప్టెంబరు 15 వెంకటాపురం.   :                                                                      ఆదివాసిల జీవనం ప్రకృతి ఒడిలో మమేకమై జీవిస్తూ ప్రకృతిలో తాము ఒకరిని జీవిస్తున్న   (కోయలు) అతి పురాతన కాలం నుండి సంస్కృతి -   ఆచార -సంప్రదాయలు ప్రకృతికి అనుగుణంగా జరుపుకునే పండుగను కొత్తల (పెద్దల) పండుగ అంటారు. ఇది ప్రతి సంవత్సరం ఉత్తర కార్తీ మొదటి పాదంలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 14,15, బుద, గురువారం లో జరుపుకోవాలని ఆదివాసీ గుడెలల్లో ఆదివాసీ పెద్దలు నిర్ణయించి జరిపేది ఈ కొత్తల (పెద్దల) పండుగ, ఈ పండుగను వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామంలో అతి పవిత్రంగా జరుపుతూ గ్రామ పెద్దలు అన్ని గ్రామాల్లో ఆదివాసీ గుడెలల్లో ఆచార సాంప్రదాయాలతో జరుపుకుంటుంన్నారు. ఈ పండుగను ఉదయాన్నే లేచి ఇళ్లు వాకిలి శుద్ధి చేసుకోని తలంటి స్నానాలు చేసి గ్రామ దేవతలు పెరమయ్య (పూజారి) వరి కంకులు సేకరించి గ్రామ దేవతల కు మొక్కి కొన్ని వరి కంకులు సమర్పించి గ్రామంలో ఆదివాసీ కుటుంబాలకు వారి ఇంటి గోత్రాన్ని బట్టి ఇంటింటికీ వరి కంకులు పంచుతారు. సాయంత్రం వేలలో ఊరి చివర ఒక ఇప్పచెట్టు క్రిందకు వెళ్లి గ్రామ పెరమయ్య (పూజారి) ఆదివాసీ లు అంతా కలిసి కొత్త ధాన్యాలు,ఇప్ప సారా,సళ్ల, అంబలి, ఆరబోసి, గ్రామంలో అందరూ చల్లంగా ఉండాలని ఏల్పులు(చనిపోయినవారు) కి మొక్కులు మొక్కి కోళ్ళు బలి ఇస్తారు ఇప్ప ఆకుల్లో ఇప్పసారా తాగుతారు, తర్వాత గ్రామంలోకి వచ్చి ఎవరి ఇంట్లో వారు కుటుంబంతో కలిసి ఇంటిలో ఈశాన్యం గదిలో (నిసాని మూలాన)తమ పూర్వీకులు వంశీయులకు కొత్త ధాన్యాలు,చెక్కర, పాయసం అండి ఇప్పసారా ఆరబోసి తల్లి కోడిని బలి ఇచ్చి దాన్ని వండి పాయసం ముద్దులు కోడి కూర కలిపి ఇప్ప ఆకుల్లో ఉంచి అందరితో వడ్డే శనార్తి(సెలవు) అడిగి ఆ పాయసం ముద్దులు కుటుంబ సభ్యులకు అందరికీ ఇచ్చి సెలవు అంటూ ఆ పాయసం ఆరగిస్తారు ఇందులో ఈ మధ్య కాలంలో చనిపోయిన వారిని పెతర్లతో కలుపుతారు, మరియు ఆ కుటుంబం లో కొత్తగా పెళ్లయిన జంటను వారిని పూర్వీకులకు తమ వంశీయులు గా హక్కులు కల్పిస్తారు.తర్వత కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేస్తారు ఇట్టి ఆచార సంప్రదాయాలతో వండిన ఆహారం ఇతరులకు పెట్టారు మరుసటిరోజు ఉదయం పెతర్ల పేరుతో వస్తు,ధన, దానం సమర్పించి కొత్తల (పెద్దల) పండుగ ఐపోయినట్లుగా భావిస్తారు.

Share it:

TELANGANA

Post A Comment: