మన్యం టివి, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని జడ్పీ హై స్కూల్లో జరగనున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల ఏర్పట్లను గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారుల తో కలిసి పరిశీలించారు.తెలంగాణ రాష్ట్రంలో 16,17,18 మూడు రోజులు ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశంతో మణుగూరు లో భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తూన్నారు.16వ తారీకు మొదటి రోజు 15 వేల మందితో జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించుటకు తగు ఏర్పాట్లను,జిల్లా కలెక్టర్ అనుదీప్,ఎంపీపీ కారం.విజయ కుమారి,తహసిల్దార్ నాగరాజ్, సీఐ రమేష్,ప్రజా ప్రతినిధులు అధికారులు కలిసి పరిశీలించారు.ఈ మూడు రోజులు అబ్బురపరిచే విధంగా సంబరాలతో ఘనంగా వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలని ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చూడాలని పోలీసులను కు, అధికారుల కు జిల్లా కలెక్టర్ సూచించారు.రేపు ర్యాలీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలను ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఈ సందర్భంగా జడ్పీ హై స్కూల్లో భోజన సమయం కావడం తో పిల్లలతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్,మండల అధికారులు ప్రజాప్రతినిధులు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ కారం.విజయ కుమారి, తహసిల్దార్ నాగరాజ్,సీఐ రమేష్, ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ వెంకటేశ్వర్లు,స్ధానిక సర్పంచ్ భారతి,ప్రజా ప్రతినిధులు,అధికారులు తదతరులు పాల్గోన్నారు.
Post A Comment: