CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వీఆర్ఏ ల సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తాం - వీఆర్ఏ ల సంఘం

Share it:


మన్యం మనుగడ, మంగపేట. : 

ములుగు జిల్లా మంగపేట  రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ ల డిమాండ్లు పరిష్కరించాలని వీఆర్ఏ ల సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వీఆర్ఏల సంఘం ఆదేశాల మేరకు మంగపేట మండలంలో వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 68 వ, రోజుకు చేరుకుంది. ఇట్టి కార్యక్రమంలో మండలంలో ఉన్న వీఆర్ఏ లు మాట్లాడుతూ ఒక పక్క బతుకమ్మ పండగ జరుగుతున్నా,మరొక పక్క రోజు భారీ వర్షాలు కురుస్తున్న లెక్క చేయకుండా వీఆర్ఏ ల ప్రాణాలు పోతున్న, వీ ఆర్ఏ లు అందరూ రోగాల పాలు అవుతున్నా సమ్మెను కొనసాగిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తొందరగా మా డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.త్వరగా మా సమస్య ను పరిష్కరించాలని లేదంటే సమ్మెను ఉదృతం చేస్తామని అన్నారు.

            ఈ కార్యక్రమంలో వీఆర్ ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు , నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మయ్య , రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: