మన్యం మనుగడ సెప్టెంబర్ 30 వాజేడు.
పెనుగోలు గ్రామానికి రహదారి సౌకర్యం లేక సగటున 18 కిలోమీటర్లు కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. వైద్యం కొరకు ఎదురు చూస్తూ, ఎక్కడో కొండల్లో కోనల్లో, ప్రకృతి ఒడిలో, అల్లారు ముద్దుగా జీవిస్తున్నారు. ప్రకృతి ప్రకోపానికో, ప్రజల జీవన విధానాల లోపం వల్లనో, అనారోగ్య బారిన పడిన ప్రజలకు వైద్యం కొరకు ఎదురుచూపు తప్పడం లేదు, పెనుగోలు ఆదివాసి గుడేల ప్రజలకు సర్కారీ వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో వాగులు, వంకలు, దాటి దట్టమైన అడవిలో నుంచి పెనుగోలు ప్రాంతానికి వెళ్లి వాజేడు పిహెచ్సి సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ చిన్న, పెనుగోలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: