CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేవనగరంలో కొత్తల పండుగ.....ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపీపీ

Share it:


మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి పంచాయతీలోని దేవనగరం గ్రామంలో తోలెం వంశం వారి ఇలవేల్పు సమ్మక్క సారక్క సన్నిధిలో కొత్తల పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతిలో సహాజసిద్దంగా తొలిసారిగా లభించే పంట గింజలను, ఆకుకూరలను దేవతామూర్తులకు సమర్పించి, పాయసం తయారు చేసి నైవేద్యం పెడతారు. ప్రకృతిని ఆరాధ్య దైవంగా భావించి, ప్రతి పంటలో వచ్చిన తొలిగింజను వారు నమ్ముకున్నటువంటి ప్రకృతి దేవతలుగా పిలవబడే ప్రతి దేవగణాలకు నైవేద్యంగా పూర్తి ఉపవాసాలతో ఉండి అమ్మవారికి సమర్పించే సంస్కృతి, సాంప్రదాయం ఆదివాసులకే సాధ్యం అని అన్నారు. అలాంటి కొత్తల పండుగ చేసుకోవడం దేవనగరం గ్రామంలోని తోలెం వంశీయుల వేల ఏళ్లనాటి ఆచారం అని అన్నారు. ప్రజా గాయకుడు సిద్దెల హుస్సేన్ అమ్మ వార్లకు సంబంధించిన భక్తి గేయాలు పాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవర బాల తోలెం నాగయ్య, భూపాలపట్నం సర్పంచ్ కృష్ణంరాజు, ఉప సర్పంచ్ నిట్ట వెంకటేశ్వర్లు, ఆదివాసి ప్రధాన కార్యదర్శి గోగ్గల కృష్ణ, పినపాక పాత్రికేయుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు  భరత్, శ్రీనివాస్, సాంబమూర్తి, ఈ పండుగను పురస్కరించుకొని సుదూర ప్రాంతాలైన వెంకటాపురం, కోదాడ, చతిస్గడ్ వరంగల్, చింతూరు ప్రాంతాలనుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: