CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలి

Share it:

ములకలపల్లి, మన్యం మనుగడ ప్రతినిధి : బిజెపి ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించాలని సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు కోరారు.మండల కేంద్రంలోని రహదారిపై బైటాయించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకుల, ధరలను వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య నిత్యవసర సరుకులపై పాలు,అల్లం పసుపు,పిండి వంటలు,గుడ్లు, కూరగాయలు అన్ని రకాల ఆహార ధాన్యాలపై మునుపు ఎన్నడూ లేని విధంగా జిఎస్టి విధించి ప్రజల దగ్గర అధిక పన్ను వసూలు చేస్తున్నారని, ధరల పెరుగుదలకు కారణమైన జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ చార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నిరుద్యోగశాస్త్రం 8.3 ఉన్నట్టు సీఎం నివేదిక చెబుతున్న దేశంలో 39.46 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నా కనీసం ప్రభుత్వ రంగ సంస్థలోని ఖాళీగా ఉన్న పోస్టులను నింపడంలో కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ఏట రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదని అన్నారు. గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే పని చేస్తుందని గ్రామీణ ఉపాధి హామీ పని యంత్రాలకే పని చూపుతున్నదని అన్నారు. గ్రామీణ ఉపాధి పథకంలో 200 రోజులు పని దినాలు కల్పించాలని రోజు కూలి 600 చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంటకు స్వామినాథన్ సిఫార్సు ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు వేతనాలు నిర్ణయించాలని అన్నారు. రైతు రుణాలు మొత్తం ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం చేస్తుందని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసహరించి,కార్మిక హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మల మధు, గోపగాని లక్ష్మీనర్సు, గడ్డం వెంకటేశ్వర్లు,సున్నం నాగులు, ఎలమంద, బీబీనేని శీను, కోయాల వెంకటేశ్వర్లు, బెజవాడ పండు, సాయి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: