CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మండలం లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

Share it:


మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని సురక్ష బస్టాండ్ వద్ద సుమారు రూ.49 లక్షలు రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సైడ్ డ్రైనేజ్ పనులకు ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శంకుస్థాపన చేశారు.అనంతరం సుందరయ్య నగర్ లో సుమారు రూ.50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నిర్మించనున్న సైడ్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు మాట్లాడుతూ,రానున్న రోజుల్లో మణుగూరు పట్టణ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తాను అన్నారు.మౌలిక వసతుల సదుపాయాలు పై ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.సిసి రోడ్ల నిర్మాణం, బిటి రోడ్ల నిర్మాణం,అంతర్గత రహదారుల నిర్మాణం సంబంధించి,మిగిలిపోయినటువంటి అభివృద్ధి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.తన పర్యటనలో భాగంగా పలువురుని ఆప్యాయంగా పలకరించుకుంటూ,వారితో మాట్లాడుతూ,వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో పురోగతి సాధించింది అని పేర్కొన్నారు.ఆర్థిక అభివృద్ధిలో తలసరి ఆదాయం పెరుగుదల లో,విద్యా,ఆరోగ్యం,ఉపాధి రంగాలలో అవకాశాలు కల్పన, విద్యుత్ సరఫరా,త్రాగునీరు, సాగునీటి సదుపాయాలో,ప్రజా సంక్షేమంలో,పారిశ్రామిక,ఐటీ రంగాల ప్రగతిలో ఇలా అనేక రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని అన్నారు,తెలంగాణలో ప్రజలకు సంక్షేమ పథకాలు, కుల చేతి వృత్తుల బలోపేతానికి ప్రభుత్వం పాటుపడుతుంది అన్నారు. సాగు,త్రాగునీరు సంక్షేమ పథకాలు అమలులో దేశంలోనే అగ్రగామిగా,నిలుస్తున్నదన్నారు.దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో చేపడుతుంటే కాంగ్రెస్,బిజెపి వాళ్లు ఉచిత పథకాలు వద్దని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. టీఆరెఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు జెడ్పిటిసి పోశం నరసింహారావు,మున్సిపల్ కమిషనర్ మాధవి,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, మండల అధ్యక్షులు ముత్యం బాబు,కార్యదర్శులు నవీన్, రామిరెడ్డి,మీడియా ఇంచార్జ్ యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు,సోషల్ మీడియా సభ్యులు,టిఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: