మన్యం మనుగడ, ఏటూరు నాగారం : మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం ఆడపడుచులు ఎంగిలి పూల బతుకమ్మను భక్తిశ్రద్ధలతో కొలుస్తూ బతుకమ్మ ఆడుకున్నారు.మండల కేంద్రంలోని బొడ్రాయి సెంటర్లో ఏటూరు నాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అక్కచెల్లెళ్లకు ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు రకరకాల పూలతో బతుకమ్మలు పేర్చి పెట్టి పాటల పాడుతూ బతుకమ్మ ఆట అంగరంగ వైభవంగా ఆనందంగా ఆడారు.దీంతో మండల కేంద్రంలో బతుకమ్మ ఆటలతో సందడిగా మారింది. ఈ బతుకమ్మ సంబరాలలో మహిళలు,యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Navigation
Post A Comment: