CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ ప్రజల ఆత్మబంధువు సీఎం కేసిఆర్

Share it:


  •  తెలంగాణ ప్రజల ఆత్మబంధువు సీఎం కేసిఆర్
  • ఆసరా పెన్షన్లు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

మన్యం టివి మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం అశోక్ నగర్ లోని గిరిజన భవన్ లో శుక్రవారం మణుగూరు, పినపాక,అశ్వాపురం,బూర్గంపాడు,కరకగూడెం,మండలాలకు చెందిన ఆసరా పెన్షన్లు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ణాత్మకంగా అందిస్తున్న పెన్షన్లు కార్డు లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నూతనంగా మంజూరైన,ఆసరా పెన్షన్లు లను అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా మాట్లాడుతూ,రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయడమే సీఎం కేసీఆర్ లక్షమన్నారు.రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ప్రతి నిత్యం పని చేస్తున్నారని తెలిపారు.పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఆసరా పెన్షన్లు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.1000 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి రూ.12 వేల కోట్ల రూపయలు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2016 రూపాయల పెన్షన్లు ఇస్తున్న ఘనత మన తెలంగాణ ప్రభుత్వం కు దక్కుతుంది అన్నారు.సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇచ్చి,ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు అన్నారు.ఇంటి జాగా ఉన్న నిరుపేదలకు ఇల్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి ఆర్థిక సహాయం అందజేస్తుందని వెల్లడించారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్  ఇప్పటికే ప్రకటించారని అన్నారు.ఇప్పటికే ఇల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నమన్నారు.దివ్యాంగులకు నెలకు రూ.3016, వితంతువులు ఇతర కేటగిరీల వారికి రూ.2016 చొప్పున అందిస్తున్నామని అన్నారు. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడపడుచులకు రూ.1,00,116 రూపాయలు అందిస్తున్న ఘనత సీఎం కేసిఆర్ దే అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, నిధులు, నియామకాలు దేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఎక్కడైనా అమలు అవుతున్నాయా అని అన్నారు.ఇదే 28 రాష్ట్రాలకు దమ్ముంటే కేసీఆర్ ప్రవేశపెట్టే పథకాలను ఆయా రాష్ట్రాలలో ప్రవేశపెట్టమని సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోడి పాలించిన గుజరాత్ లో 600 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో ఉచిత పథకాలను రద్దు చేయాలని నిర్ణయించారు అని తెలిపారు. సీఎం కేసీఆర్ చేస్తున సంక్షేమ పథకాలు చూసి బిజెపి నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు అని, ప్రజలు అన్ని విషయాలు గమనించాలని తెలిపారు. పేద ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం లోని మండలాల ప్రభుత్వ అధికారులు,టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,పార్టీ ముఖ్య నాయకులు, యువజన నాయకులు,స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: