CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ,గిరిజన,ప్రజలకు అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత రేగా కాంతారావు  ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఇచ్చిన మాట ప్రకారం పొడు రైతులకు పట్టాలు ఇచ్చి మరియు మిగిలిన భూములన్నీ గిరిజన ప్రజలకు గిరిజన బంధు రూపంలో అందజేస్తామని హామీ ఇచ్చినా సీఎం కేసీఆర్ అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్  ఆధ్వర్యంలో చిత్రపటానికి పాలాభిషేకం చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కోడి అమరేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించగల శక్తి సామర్ధ్యాలు ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్  అన్నారు. పేదలకు అన్ని విధాలా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్  పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని అన్నారు,ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1000 కోట్ల చొప్పున ఏడాదికి 12 వేల కోట్ల ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 2016 పింఛన్ ఇస్తున్న ఘనత మన తెలంగాణ ప్రభుత్వానిది అన్నారు, సీఎం కేసీఆర్  హామీ మేరకు 57 ఏండ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామన్నారు. ఇంటి జాగా ఉన్న నిరుపేదల ఇల్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దసరా నుంచి ఆర్థిక సహాయం అందజేస్తుందని వెల్లడించారు, ఈ పథకాన్ని సీఎం కేసీఆర్  ఇప్పటికే ప్రకటించారని అన్నారు, ఇప్పటికే ఇల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తున్నమన్నారు.దివ్యాంగులకు నెలకు రూ.3016 వితంతువులు ఇతర కేటగిరీల వారికి రూ. 2016 చొప్పున అందిస్తున్నామని అన్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడపడుచులకు 1,16 రూపాయలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. దేశం గర్వించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్  పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.దేశం లో ఉన్నటువంటి 28 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు ఏ రాష్ట్రంలో లేవు అని అన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు మస్తు మాటలు చెబుతున్నారని వాళ్ళని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని గుర్తు చేశారు సీఎం కేసీఆర్  హయాంలో అన్ని కులాలకు అభివృద్ధి జరుగుతున్నదని అన్నారు.ఆత్మగౌరవ ప్రతీక ఆదివాసీ కొమరం భీమ్ భవనాన్ని కూడా సెప్టెంబర్ 17 వా తారీకునా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,సర్పంచులు,ఉప సర్పంచులు,ఎంపీటీసీలు  నాయకులు,బీసీ,ఎస్సీ,ఎస్టీ నాయకులు,మహిళా నాయకులు,యువజన నాయకులు,ఆదివాసీ,గిరిజన ప్రజలు,కార్యకర్తలు,అభిమానులు, పార్టీ ముఖ్య నాయకులు,స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: