CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజకీయాలలో యువకులు క్రియాశీలక పాత్ర పోషించాలి:బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:


మన్యం టివి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాక లోని రైతు వేదిక క్లస్టర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు,ఆదేశాల మేరకు, సారపాక టౌన్ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం సమావేశానికి ముఖ్య అతిథిగా బూర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత హాజరైయ్యారు.ఈ సందర్భంగా బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకోవాల్సిన బాధ్యత యువత  పైన ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగా కాంతారావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని అందరికీ తెలిసేలా గ్రామాలలో యువత బాధ్యత తీసుకోవాలన్నారు.టిఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు.దేశంలో ఎక్కడైనా విధంగా సీఎం కేసీఆర్ రైతుబంధు,రైతు బీమా, కళ్యాణ లక్ష్మి షాదీ, ముబారక్, వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, నియోజవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచందర్ రావు,సారపాక టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాస్,టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి,ఎర్ర శీను,చిరంజీవి,వెంకటేష్,దాసరి విజయ్ కుమార్,రిక్షా కాలనీ రాజు,విక్రమ్,శశి,మోతే తుమ్మల కిరణ్,సురేష్,కృష్ణ, బొబ్బిలి,బెజ్జంకి కనకాచారి, పోడియం నరేంద్ర,తుపాకుల రవి,కర్రీ కోటేశ్వరావు,అరుణ్ ప్రసాద్,మోహన్,కరెంటు రవి, రంజిత్,గుల్ మహమ్మద్, బెల్లంకొండ రామారావు,ఖాదర్, స్థానిక యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: