CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ధరల నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం

Share it:

 


*పెరుగుతున్న అధిక ధరలను నియంత్రించాలి.

 *ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు డిమాండ్.

*మన్యం మనుగడ ఏటూరు నాగారం*

ఏటూరునాగారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ.భాజపా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వస్తువుల పైన జీఎస్టీ పేరు చెప్పి అధిక రేట్లు పెంచడం జరుగుతుంది పెట్రోల్ గతంలో 60 రూపాయలు ఉండగా నేడు 110 రూపాయలకు మారిందని,డీజిల్ రేట్లు గతంలో 1లీటర్ 60 రూపాయలు ఉండగా ఇప్పుడు 100 రూపాయలుగా పెరిగింది,  దసరా సందర్భంగా ఇంట్లో కుటుంబ సమేతంగా పిండి వంటలు,తినుబండారాలు వండుకొని తిందామంటే నూనె కేజీ 220/- రూపాయలు ఉంది,పప్పు కేజీ 80 రూపాయలు ఉంది ఉప్పు, ఉల్లిగడ్డ నిత్యవసర వస్తువుల పైన అధిక ధరలను అధికంగా పెంచారు.అదే పండగ పూట ఒక కేజీ చికెన్ తిందామను కుంటే 300రూపాయలు,కేజి మటన్ 700రూపాయలు ఉందనీ,శనిగ,గోధుమ,పెసర,పిండి రేట్లు అధికంగా పెరిగింది అలాగే కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు కొందమంటే అధిక రేట్లు అయిపోయాయని,గ్యాస్ ధర 1200/-రూపాయలు ఉందనీ అన్నారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు చదువుకునే పుస్తకాల పైన పెన్నుల పైన పెన్సిల్ పైన జిఎస్టి వేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.

నిరుపేదవాడు పండుగ పూట రెండు పూటల అన్నం తిందామంటే నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని ఒక పూట పస్తులు పడుకొని ఒక పూట అన్నం తింటున్నారని ఈ పెరిగిన ధరల వల్ల ప్రజలు  సద్దుల పండుగను దసరా పండుగను సంతోషంగా చేసుకునే విధంగా లేరని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విపలమయ్యాయని ఈ ధరల నియంత్రణ చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారని, అదేవిధంగా బస్ చార్జీలు కరెంటు చార్జీలు పెరిగి ప్రజలపై పెను భారము మోపరని నిరంతరం కష్టపడ్డ ఈ నిత్యవసర ధరల వస్తువులకు కరెంటు చార్జీలకు అయిపోతున్నాయని మరి నిరుపేదవాడు రూపాయి వెనక వేసుకొని కష్ట కాలములో ఆపద వస్తే ఆ రూపాయిని ఖర్చు పెట్టుకునే పరిస్థితి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో లేదని అన్నారు.

అదే విధంగా రైతన్న పరిస్థితి చూసుకుంటే గతంలో 20-20 బస్తా ఎనిమిది వందల యాభై రూపాయలు ఉండే ఇప్పుడు అదే బస్తా 1450 రూపాయా లకు వస్తుందని,డిఎపి 1000 రూపాయలు ఉన్న బస్తా ఇప్పుడు 1400 రూపాయలు అయిందని ఫొటోస్ బస్తా 550 నుండి 1200 రూపాయలు అయిందని ఫొటాస్ బస్తా మార్కెట్లో దొరుకుతలేదని కేంద్ర రాష్ట్ర వైఫల్యాల వల్ల రైతన్నలకు కూడా బ్లాక్ మార్కెట్లో మందు పిండి బస్తాలు దొరుకుతున్నాయని, రైతన్న ను గోస పుచ్చుకున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని ప్రజల రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారని అన్నారు.ఈ కార్య క్రమంలో జిల్లా నాయకులు ఖలీల్,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్నల్లయ్య,పిఎసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి యాదవ్,జిల్లా యూత్ కార్యదర్శి ఎండి గౌస్,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు కర్నె సత్యం, మండల యూత్ అధ్యక్షుడు వసంత శ్రీనివాస్,మండల సోషల్ మీడియా సోదారి హరీష్,దుర్గం అర్జున్,కుమ్మరి శివ తదితరులు పాల్గొన్నారు.

Share it:

AP

TELANGANA

Post A Comment: