CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వీఆర్ఏ ల సమస్య న్యాయమైనది సీఎం దృష్టికి తీసుకెళ్తా....ఎమ్మెల్యే పొదెం వీరయ్య.

Share it:


మన్యం మనగడ, వాజేడు, సెప్టెంబర్ 3 :  రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల నిర్వాదిక సమ్మె నిర్వహిస్తున్నారు. 41 రోజుగా దీక్షలు చేస్తున్న వీఆర్ఏల డిమాండ్ న్యాయమైనదని తక్షణమే పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తానని, అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వ కుంట్ల చంద్ర శేఖర్ రావు అసెంబ్లీలో ప్రకటించినటు వంటి పే స్కేలు జీవోను వెంటనే అమలు చేయాలి.  అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తూ 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ లకు, వి ఆర్ యస్ అవకాశం కల్పిస్తూ వారికి అన్ని బెనిఫిట్స్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. హామీలు ఇంత వరకు అమలు చెయ్యక పోవడంతో వాటి అమలు కోసం వాజేడు మండల కేంద్రంలో  వీఆర్ఏల (41వ రోజు) నిరవధిక సమ్మె కొన సాగుతుంది. సమ్మె కి ఈ రోజు భద్రాచలం ఎమ్మెల్యే, పొదెం వీరయ్య  మద్దతు తెలుపుతు 06.08.2022 నాడు జరిగే అసెంబ్లీ సమావేశాలలో, కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత శ్రీ బట్టి విక్రమార్క తో స్పెషల్ మెమో 304  ద్వారా వీఆర్ఏ ల యొక్క సమస్యల పై  ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఈ సమస్యలను పరిష్కరించడానికి అసెంబ్లీ లో ప్రభుత్వంతో చర్చిస్తామని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, తెలిపినారు.ఈ కార్యక్రమంలో వాజేడు సర్పంచ్.ఆదినారాయణ,చేరుకురు, సర్పంచ్, అనంత, చీకుపల్లి, సర్పంచ్, మండల నాయకులు, పూనెం రాంబాబు, జగన్ బాబు, ఖాజావాలి విక్రాంత్ బాబు.  వీఆర్ఏ మండల అధ్యక్షుడు కుంధమల్ల సురేష్,   మహిళా అధ్యక్షురాలు చుంచు అనూష, కుందమల్ల నాగరాజు, , కావిరి బాలచంద్ర మూర్తి, జాడి తిరుపతి, కాట తిరుపతమ్మ, వేల్పుల ఉదయ, అట్టం కృష్ణారావు, సమీర్,జాడి మల్లయ్య పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: