CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సింగరేణి కార్మికుల సంఘీభావం

Share it:


మన్యం టివి, మణుగూరు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సత్వరమే సమస్యల పరిష్కరించాలనీ సింగరేణి  కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేశారు.వేతన పెంపు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ, సింగరేణి  కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత 13 రోజులుగా సింగరేణి వ్యాప్తంగా నిరవధిక సమ్మె ఉదృతంగా కొన సాగుతున్న నేపథ్యంలో ఏరియా సింగరేణి అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఏరియాలోని ఓసి-2, కొండాపురం,సిఎస్ పి లలో సింగరేణి కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులకు తమ మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా సింగరేణి జేఏసీ నాయకులు మాట్లాడారు.వేతన పెంపు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత 13 రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేస్తుంటే,అటు రాష్ట్ర ప్రభుత్వం గానీ,ఇటు సింగరేణి యాజమాన్యం కానీ, స్పందించకపోవడం పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే క్యాంటీన్ లు బంద్ కావటంతో అల్పాహారానికి ఇబ్బంది అవుతోందని, పారిశుధ్యం లేక కాలనీలు కంపు కొడుతున్నాయని, ఉద్యానవన కార్మికుల సమ్మెతో పార్కులు పాడైపోతున్నాయని, రైల్వే కాంటాక్ట్ కార్మికులు భారీ యంత్రాల కాంట్రాక్ట్ కార్మికులు, సివిల్,రోడ్స్ క్లీనింగ్,లోడింగ్ అన్ లోడింగ్ అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ఉత్పత్తి ఉత్పాదకతతో పాటు అన్ని విధాలుగా పర్మినెంట్ కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.దీంతోపాటు తమతో పని చేసే చిరుద్యోగులు ఇన్ని రోజుల నుండి సమ్మె చేస్తుంటే తమకు కూడా అంతగా మంచిది అనిపించడం లేదని కార్మిక శాఖ అధికారుల  సమక్షంలో చేసుకున్న వ్రాత పూర్వక ఒప్పందాన్ని అమలు చేయడానికి యాజమాన్యానికి ఇబ్బంది ఏమిటని వారు ప్రశ్నించారు.ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి గురువారం హైదరాబాదులో జరిగే చర్చల్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వై రామ్ గోపాల్,ఐ ఎన్ టి యు సి నాయకులు వెలగపల్లి జాన్,సిఐటియు నాయకులు వల్లూరి వెంకటరత్నం,ఐ ఎఫ్ టి యు నాయకులు నాసర్ పాషా, నాయకులు మేకల ఈశ్వర్, నజీరుద్దీన్ బాబా,రహీం పాషా,శ్రీనివాస్,వెంకట నరసయ్య,శెట్టి,నరేష్,సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మిడిదొడ్ల నాగేశ్వరరావు,ఏ మంగీ లాల్, సంతోష్,సాధన పల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: