CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Share it:

 


*ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

*మలివిడత తెలంగాణ ఉద్యమ చుక్కాని.

*జలదృశ్యం వేదికగా మలివిడత ఉద్యమానికి నాంది.

*కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో తెలంగాణలో ఉద్యాన విశ్వవిద్యాలయం.

*నికార్సైన తెలంగాణ వాది.

నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. 

*మన్యం మనుగడ ములుగు*

మలి విడత తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్  బాపూజీ చుక్కాని వంటి వారని  జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు.మంగళవారం ములుగు జడ్పీ కార్యాలయంలో కార్యాలయ డిప్యూటీ సిఇఓ,కార్యాలయ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ నాయకులతో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ మేరకు జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ మలి విడత తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో అంకితమైన తెలంగాణ వాది కొండాలక్ష్మణ్ బాపూజీ అని,హైద్రాబాద్ లోని లక్ష్మణ్ బాపూజీ ఏర్పాటు చేసుకున్న జల దృశ్యాన్ని మలి విడత తెలంగాణ ఉద్యమానికి పునాదిగా అందించారని, తొలివిడత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలివేసిన నాయకుడు అని, తొలివిడత, మలివిడత తెలంగాణ ఉద్యమాలకు ఎంతగానో కృషి చేసిన  కొండా లక్ష్మణ్ బాపూజీకి  గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయన పేరా ఉద్యాన విశ్వ విద్యాలయం ఏర్పాటుచేసి ఆయన పై ఉన్న గౌరవాన్ని తెలియజేసిందన్నారు. నికార్సైన తెలంగాణ వాదిగా, స్వాతంత్ర్య సమరయోధునిగా నిజాం నిరంకుశంపై పోరాడిన వ్యక్తిగా పేరొందిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వెంట మాజీ ఎంపి సీతరాం నాయక్, ములుగు, వెంకటాపూర్,ఏటూరునాగారం  మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,రమణారెడ్డి, సునీల్ కుమార్,ములుగు జడ్పీటిసి సకినాలభవాని,గోవిందరావుపేట ఎంపిపి సూడి శ్రీనివాస్ రెడ్డి, ములుగు ఎంపిటిసి గొర్రె సమ్మయ్య,నర్సాపూర్ పిఎసిఎస్ చైర్మన్ మాడుగుల రమేష్,ఎంపిటిసిల ఫోరం జిల్లాఅధ్యక్షుడు విజయ్, ములుగు టౌన్ అధ్యక్షుడు విజయ్,ములుగు మండల యువజన విభాగం నాయకుడు సాగర్,బుర్ర సమ్మయ్య మల్లారెడ్డి,మురళీ, మోహన్,సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

CINEMA

TELANGANA

Post A Comment: