CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములపై ప్రభుత్వ జీఓపై హర్షం టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి

Share it:


మన్యం మనుగడ,పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల పినపాక మండల తెరాస పార్టీ కార్యాలయం నందు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి  ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణా సీఎం కేసీఆర్  చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోడు రైతుల జీవితాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర ప్రభుత్వ విప్,  పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు  రేగా కాంతారావుకి మండల పోడుసాగుదారుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు  తెలియజేశారు. 

గిరిజన ప్రజల ఆపద్బాంధవుడు  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారని  అన్నారు. పొడు భూములకు పట్టాలిస్తామని శాశ్వత పరిష్కారం చూపించామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన ఆనందం కలిగించిందని అని అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వ విప్  రేగా కాంతారావు కృషితోనే పోడు పట్టాలు ఇప్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. 

ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించే ముఖ్యమంత్రి కేసీఆర్ , రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు  కృషి మరువలేనిది అన్నారు.

పోడు భూములకు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్  జీవో నెంబర్ 140 విడుదల చేశారన్నారు. తెలంగాణలో లక్షలాది ఎకరాలు సాగు చేసుకుంటున్న పోడు రైతులకు ఈ ప్రకటన ఆనందాన్ని నింపిందన్నారు.

అదేవిధంగా పినపాక  మండల ప్రజల తరఫున సీఎం కేసీఆర్ కి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ  కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మ, రైతు బంధు అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ నాయకులు దాట్ల వాసుబాబు,బత్తుల వెంకటరెడ్డి,ముక్కు వెంకటేశ్వరరెడ్డి, రాయల బాబు, ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్‌లు కోరం రజిని, బాడిష మహేష్‌, నాలి మహేష్‌, కొర్సా కృష్ణంరాజు,  శివ శంకర్‌, సుధాకర్‌, సంపత్‌, నారాయణ, అశోక్‌, నాయకులు తోలెం , రమేష్‌, వారా నర్సింహారావు, పాయం నరేష్‌, రామకృష్ణ, ఇర్పా సాంబశివరావు, ప్రశాంత్‌ మోహన్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.


Share it:

CINEMA

TELANGANA

Post A Comment: