జూలూరుపాడు సెప్టెంబర్ 12, (మన్యం మనుగడ ప్రతినిధి) సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జూలూరుపాడు మండల కార్యదర్శి ఎదులాపురం గోపాలరావు తండ్రి చిన్న రాములు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు సోమవారం చిన్న రాములు మృతదేహాన్ని సందర్శించి పూలమాల లేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సందర్శించిన వారిలో స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన రావు, సీనియర్ నాయకులు రామిశెట్టి రాంబాబు, మోదుగు రామకృష్ణ, పనితీ వెంకటేశ్వర్లు, మిరియాల కిరణ్ తదితరులు ఉన్నారు.
Navigation
Post A Comment: